గతేడాదిలో మహిళలపై నేరాలు 4 శాతం మేర పెరిగాయని నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో వెల్లడించింది. భర్త లేదా అతడి బంధువుల క్రూరత్వమే మహిళలపై నేరాలలో అధికమని పేర్కొంది. ఈ మేరకు నివేదికను విడుదల చేసింది. ఇక పిల్లలపైనా నేరాలు అధికమవుతున్నాయని, నేరాలు ఏకంగా 8.7 శాతం మేర పెరిగాయని ఆందోళన వ్యక్తం చేసింది. కిడ్నాప్, అపహరణతోపాటు పోక్సో చట్టం క్రింద లైంగిక సంబంధ కేసులు నమోదవుతున్నాయని వెల్లడించింది. 2021 సంవత్సరంతో పోల్చితే నేరాల సంఖ్య గణనీయంగా పెరిగిందని వివరించింది. 2022 ఏడాదిలో దేశవ్యాప్తంగా 58లక్షల24వేల946 కేసులు నమోదయ్యాయి. అంతకుముందు ఏడాదితో పోల్చితే ఇది 4.5 శాతం ఎక్కువగా ఉంది. ఈ కేసుల్లో ఐపీసీ క్రింద 35లక్షల61వేల379 నేరాలు నమోదయ్యాయి. ఇక ప్రత్యేక, స్థానిక చట్టాల క్రింద 22లక్షల 63వేల567 నేరాలు నమోదయ్యాయి. ఈ చట్టాల క్రింద నమోదయిన కేసుల సంఖ్యలో కాస్త తగ్గుదల కనిపిస్తున్నా ఇతర చట్టాల క్రింద నమోదైన కేసుల సంఖ్య భారీగా పెరిగింది.
మహిళలపై నేరాలు ఆగేదెప్పుడు..?
50
previous post