ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఉద్యమం 1,500 రోజులకు చేరుకుంది. అమరావతి పరిరక్షణే ఊపిరిగా, మూడు రాజధానులకు వ్యతిరేకంగా వారు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. సంవత్సరాలు గడిచిపోతున్నా అమరావతి రైతులు, మహిళలు, కూలీలు, వృద్ధులు సంకల్ప బలాన్ని కోల్పోలేదు. తమపై ఎన్నో కేసులను పెట్టినా వారు వెనకడుగు వేయలేదు. దేశ చరిత్రలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ప్రాంత ప్రజలు ఇంత సుదీర్ఘంగా ఉద్యమించడం ఇదే తొలిసారి కావచ్చు. మరోవైపు తమ ఉద్యమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మద్దతును కూడగట్టేందుకు అమరావతి రైతులు 2021 నవంబర్ 1న న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పేరుతో తుళ్లూరు నుంచి తిరుమలకు పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్ర విజయవంతమయింది. అనంతరం 2022 సెప్టెంబర్ 12నశ్రీకాకుళంలోని అరసవల్లి వరకు పాదయాత్ర ను ప్రారంభించారు. ఈ యాత్రకు దారిపొడవునా వైసీపీ శ్రేణులు అడ్డుతగిలాయి. అడ్డంకులను ఎదుర్కొంటూనే రామచంద్రాపురం వరకు పాదయాత్ర చేశారు. ఆ తర్వాత ఆపేయాల్సి వచ్చింది. అమరావతి రైతులకు విపక్ష పార్టీలన్నీ అండగా ఉన్నాయి.
Women
ఎన్నికల హామీల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోంది. కాగా గురువారం రాత్రి 12 గంటల నుంచి జీరో టికెటింగ్ విధానం అమ్లలోకి వచ్చింది. జీరో టికెట్లను జారీ చేయాలని ఆర్టీసీ అధికారులకు ఎండీ వీసీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. జీరో టికెటింగ్ విధానాన్ని గురువారం రాత్రి ప్రయోగాత్మకంగా పరిశీలించారు. అది విజయవంతమవ్వడంతో అమల్లోకి తీసుకొచ్చారు. ఈ మేరకు టికెట్లు జారీ చేసే టిమ్ మెషిన్లలో ప్రత్యేక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారు. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నారు, ప్రయాణించేది ఆర్డినరీ బస్సా లేక ఎక్స్‌ప్రెస్ బస్సా అనే వివరాలు జీరో టికెట్ పై రికార్డ్ అవుతున్నాయి. మరోవైపు రెగ్యులర్ బస్సులతోపాటు ప్రత్యేక బస్సుల్లో కూడా మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. పండుగలు, జాతరల సమయాల్లో నడిపే బస్సు సర్వీసుల్లో కూడా ఉచిత ప్రయాణం చేయవచ్చని తెలిపింది. వారాంతాల్లో నడిపే అదనపు బస్సులకూ ఈ నిర్ణయం వర్తిస్తుందని తెలిపింది. మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లకు జీరో టికెట్‌పై ప్రయాణించవచ్చు. కొమురవెల్లి, నాగోబా వంటి జాతరలతోపాటు ప్రధానమైన పండుగలకు ప్రత్యేకంగా నడిపే సర్వీసుల్లో ఈ వెసులుబాటు మహిళలకు అందుబాటులో ఉంటుంది.
గతేడాదిలో మహిళలపై నేరాలు 4 శాతం మేర పెరిగాయని నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో వెల్లడించింది. భర్త లేదా అతడి బంధువుల క్రూరత్వమే మహిళలపై నేరాలలో అధికమని పేర్కొంది. ఈ మేరకు నివేదికను విడుదల చేసింది. ఇక పిల్లలపైనా నేరాలు అధికమవుతున్నాయని, నేరాలు ఏకంగా 8.7 శాతం మేర పెరిగాయని ఆందోళన వ్యక్తం చేసింది. కిడ్నాప్, అపహరణతోపాటు పోక్సో చట్టం క్రింద లైంగిక సంబంధ కేసులు నమోదవుతున్నాయని వెల్లడించింది. 2021 సంవత్సరంతో పోల్చితే నేరాల సంఖ్య గణనీయంగా పెరిగిందని వివరించింది. 2022 ఏడాదిలో దేశవ్యాప్తంగా 58లక్షల24వేల946 కేసులు నమోదయ్యాయి. అంతకుముందు ఏడాదితో పోల్చితే ఇది 4.5 శాతం ఎక్కువగా ఉంది. ఈ కేసుల్లో ఐపీసీ క్రింద 35లక్షల61వేల379 నేరాలు నమోదయ్యాయి. ఇక ప్రత్యేక, స్థానిక చట్టాల క్రింద 22లక్షల 63వేల567 నేరాలు నమోదయ్యాయి. ఈ చట్టాల క్రింద నమోదయిన కేసుల సంఖ్యలో కాస్త తగ్గుదల కనిపిస్తున్నా ఇతర చట్టాల క్రింద నమోదైన కేసుల సంఖ్య భారీగా పెరిగింది.
మహిళల ఓటింగ్ శాతం పెంచేందుకు పలుచోట్ల వారి కోసం ఎన్నికల సంఘం ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. మహిళా ఆదర్శ పోలింగ్ కేంద్రం పేరుతో వీటిని ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గంలోను ఆదర్శ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వాటిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ పోలింగ్ కేంద్రాల్లో మహిళలు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఖమ్మం జిల్లాకు చెందిన మహిళా మోడల్ పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఫొటోలను ట్వీట్ చేశారు.
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జిల్లాలో పకడ్బందిగా నిర్వహించేందుకు, అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ ఆదేశించారు. జిల్లాల్లో అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫ రెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ, ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ, ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల ఏర్పాటు, ఈ వీఎంయంత్రాల తరలింపు, కౌంటింగ్ ఏర్పాట్లు తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులతో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళలు, యువత, దివ్యాంగుల ను పోలింగ్లోభాగస్వామ్యం చేసేలా మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ నిర్వహణకు డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను కట్టుదిట్టంగా ఏర్పాటు చేయాలని, విధులు నిర్వహించే పోలింగ్ సిబ్బందికి అవసరమైన ఏర్పాట్లు కల్పించాలని అన్నారు.





Total views : 75407