89
కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మేడ్చల్ జాతీయ రహదారి కొంపల్లి లో లారీ – భైక్ ఢీకొని రోడ్డు ప్రమాదానికి గురయ్యాయి. ఈ సంఘటనలో అయ్యప్పస్వామి మాల దారన వ్యక్తి మృతి చెందారు. స్దానికుల సమాచారం తో సంఘటన స్ధలం చేరుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు.. ప్రాదమిక దర్యాప్తు లో మృతుడు ఉషన్ గారి వెంకటేశ్, SBI బ్యాంకు లో ఔట్ సోర్స్ ఉద్యోగిగా గుర్తించారు. లారీ డ్రైవర్ అతి వేగంగా, నిర్లక్ష్యం గా డ్రైవ్ చేయడం కారణంగా రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పేట్ బషీరాబాద్ పోలీసులు మృతుని బందువుల ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.