ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించే ఆపరేషన్ ఎనిమిదో రోజు కొనసాగుతోంది. సిల్క్యారా టన్నెల్ నుంచి కార్మికులను ఖాళీ చేయడానికి ఐదు ప్రణాళికలను సిద్ధం చేసినట్లు రోడ్డు రవాణా శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ ప్రభుత్వ నిర్ణయంపై సమాచారం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం శనివారం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలోనే కార్మికులను రక్షించడానికి ఈ ఐదు ప్రణాళికలను సిద్ధం చేశారు. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగం కుప్పకూలిన తర్వాత గత ఏడు రోజులుగా అందులో చిక్కుకున్న 41 మంది కార్మికులకు ప్రభుత్వం మల్టీవిటమిన్లు, యాంటీ డిప్రెసెంట్స్‌తో పాటు డ్రై ఫ్రూట్స్‌ను పంపుతున్నట్లు అనురాగ్ జైన్ తెలిపారు.ఉత్తరకాశీ జిల్లా ప్రధాన కార్యాలయం నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిల్క్యారా టన్నెల్ కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక చార్ధామ్ ‘ఆల్ వెదర్ రోడ్’ ప్రాజెక్ట్‌లో భాగంగా దీన్ని నిర్మిస్తోంది. నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ సొరంగం నిర్మాణం జరుగుతోంది. సిల్క్యారా వైపు నుంచి భూగర్భం లోపల 270 మీటర్ల దూరంలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో 30 మీటర్ల మేర గత ఆదివారం ఉదయం కూలిపోయింది. దీంతో అందులో పని చేస్తున్న కార్మికులు అందులో చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నారు
సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు క్షేమం.. ఫోటోలు ఇవిగో..!
46
previous post