దీపావళి పండుగ అందరి జీవితాల్లో వెలుగును నింపి, వేడుకల వాతావరణాన్ని పెంచే అతి పెద్ద పండుగ. అయితే, ఈ పవిత్రమైన రోజును అయోధ్య నగరంలో ఒక్క రోజు ముందు జరుపుతారు. సరయూ నదీ తీరంలో వెలిగించే దీపాలు సరికొత్త ప్రపంచ రికార్డునూ సృష్టించాయి. రామమందిరం త్వరలోనే ప్రారంభం కానుండగా.. ఇప్పటి నుంచే సంబరాలు మొదలయ్యాయి. అయోధ్యలోని సరయూ నదీ ఒడ్డున గత ఏడేళ్లుగా దీపావళికి ముందు రోజు దీపోత్సవం నిర్వహిస్తున్న విషయం మనందరికి తెలిసిందే. సరయూ తీరంలోని 51 ఘాట్లలో 22 లక్షలకు పైగా దీపాలను వెలిగించారు. ఈ దీపోత్సవంలో 25 వేల మందికిపైగా పాల్గొని 22 లక్షలకుపైగా దీపాలను వెలిగించారు. అయితే, గతేడాది 15.76 లక్షల దీపాలను వెలిగించగా ఈ ఏడాది ఆ రికార్డును బద్దలుకొట్టింది. కొత్త రికార్డును సృష్టించింది.ఈ కార్యక్రమానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధుల బృందం హాజరై.. డ్రోన్ కెమెరాతో వెలిగించిన దీపాలను లెక్కించారు. ప్రపంచ రికార్డును ధ్రువీకరిస్తూ యూపీ ముఖ్యమంత్రికి గిన్నీస్ సర్టిఫికేట్ను అందించారు. రావణ సంహారం తర్వాత సీతాసమేతంగా అయోధ్యలో అడుగుపెట్టిన శ్రీరామునికి సోదరులు భరత శతృఘ్నులు స్వాగతం పలికిన సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించే రథోత్సవ వేడుకలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ అనందీబెన్ పటేల్ పాల్గొన్నారు. అనంతరం సరయూ తీరంలో యోగి ఆదిత్యనాథ్ సరయూ హారతి నిర్వహించి, ‘దీపోత్సవ్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ప్రపంచ రికార్డు సృష్టించిన అయోధ్య దీపావళి
48
previous post