53
అయోధ్యలో రామ మందిరం నిర్మాణం దాదాపు పూర్తయిన నేపథ్యంలో, ఇకపై ఈ నగరానికి రాకపోకలు పెరగనున్నాయి. అయోధ్యలో నిర్మించిన రామ మందిరంలో జనవరి 22న ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. అనంతరం, ఆలయంలోకి భక్తులను అనుమతించనున్నారు. రామజన్మభూమిగా పేర్కొంటున్న అయోధ్యకు నిత్యం వేలాదిగా భక్తులు తరలివస్తారని భావిస్తున్నారు. ఇక, అయోధ్యలో నిర్మించిన మర్యాద పురుషోత్తమ్ శ్రీ రామ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు డిసెంబర్ 30న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో, ఇండిగో ఎయిర్ లైన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ముంబయి నుంచి అయోధ్యకు నేరుగా విమానాలు నడపాలని నిర్ణయించుకుంది.