డెలివరీ తర్వాత జుట్టు రాలటానికి కారణాలు, నివారణ మరియు చిట్కాలు
డెలివరీ తర్వాత చాలా మంది మహిళలు జుట్టు రాలడం అనే సమస్యను ఎదుర్కొంటారు. అధిక ఒత్తిడి వల్ల ఇలా జరుగుతుంది. ఇది చాల సర్వసాధారణమైన విషయం, డెలివరీ తర్వాత జుట్టు రాలడానికి కారణాలు, దానిని నివారించడానికి చిట్కాలు మరియు చికిత్స గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Follow us on :Facebook, Instagram, YouTube & Google News
డెలివరీ తర్వాత జుట్టు రాలటానికి కారణాలు | Hair Fall After Delivery:
గర్భధారణ సమయంలో హార్మోన్ల స్థాయిలు పెరుగుతాయి, హార్మోన్ల(hormones) మార్పులు వలన ఇది జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది. కానీ డెలివరీ తర్వాత మాత్రం ఈ హార్మోన్ల స్థాయిలు తగ్గుతాయి, ఫలితంగా జుట్టు ఊడిపోతుంది. డెలివరీ సమయం లో చాల ఒత్తిడి కి లోనవుతుంటారు అందువలన ఒత్తిడి జుట్టు రాలడానికి దోహదం చేస్తుంది. డెలివరీ తర్వాత, మీ శరీరం మీ బిడ్డకు పోషకాలను అందిస్తుంది. అలంటి సమయం లో మీకు తగినంత పోషకాలు లభించకపోతే, అది మీ జుట్టు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. పిల్లలను చూసుకోవడం వల్ల చాలా మంది మహిళలకు నిద్రలేమి వస్తుంది. నిద్రలేమి వల్ల కూడా జుట్టు రాలడం జరుగుతుంది.
డెలివరీ తర్వాత జుట్టు రాలకుండా ఉండటానికి నివారణ చిట్కాలు:
ఆరోగ్యకరమైన ఆహారం తినటం వల్ల జుట్టు బలంగా అవుతుంది, పోషకాలతో నిండిన ఆహారం(Nutritious food) తినండి, ముఖ్యంగా ప్రోటీన్, ఐరన్ మరియు విటమిన్ B(Vitamin B) మీ ఆహరం లో ఉండేలాగా చూసుకోండి. యోగా, ధ్యానం లేదా శ్వాస వ్యాయామాల ద్వారా ఒత్తిడిని నివారించండి. ప్రతి రాత్రి 7-8 గంటల నిద్ర పొందడానికి ప్రయత్నించండి. జుట్టును అన్ని వేళలా జాగ్రత్తగా చూసుకోండి జుట్టును చిక్కుకుపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. పోషకాల సప్లిమెంట్స్ తీసుకోండి మీ వైద్యుడి సలహా మేరకు మీరు పోషకాల సప్లిమెంట్స్ తీసుకోవచ్చు.
మహిళల్లో డెలివరీ తర్వాత జుట్టు రాలటం అనేది సాధారణ సమస్యే అయినప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మీ జుట్టుని కాపాడుకోవచ్చు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి