నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లేనని సీఎం రేవంత్ అన్నారు. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఐలైన్ స్టూడియో కార్యాలయాన్ని హైటెక్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ అన్ని అవకాశాలను కల్పిస్తుందని నెట్ ఫ్లిక్స్ కు మా ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పారు. బాల్యం నుంచే తనకు సినిమాలపై ఆసక్తి ఉందని తన చిన్నతనం నుంచి ఇప్పటి వరకు సినిమాలో అనేక మార్పులు వచ్చాయన్నారు. బాహుబలి, కల్కి, ట్రిపుల్ ఆర్, అరుంధతి వంటి అత్యున్నత సాంకేతికతో కూడిన సినిమాలు వచ్చాయని గుర్తు చేశారు. తెలుగు చిత్రపరిశ్రమను చెన్నై నుంచి ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు హైదరాబాద్‌కు తీసుకు వచ్చారన్నారు.
నెట్ ఫ్లిక్స్ కు దేశంలోనే హైదరాబాద్ ది రెండో కార్యాలయం అని సీఎం చెప్పారు. తమ దృష్టి హాలివుడ్ పైననే అని గతంలోనే చెప్పానని అన్నారు సీఎం. నెట్ ఫ్లిక్స్ తో తన కల నిజం కాబోతుందన్నారు. ఫోర్త్ సిటీని నిర్మిస్తున్నామని, విస్తరణకు.. పెద్ద ఆఫీస్ నిర్మాణానికి కావాల్సిన భూమి ఫ్యూచర్ సిటీలో ఇవ్వడానికి సిద్ధంగా తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. నెట్ ఫ్లిక్స్ కార్పొరేట్ ఆఫీస్ ను ఫ్యూచర్ సిటీకి తీసుకురావాలని కోరుతున్నానన్నారు. ప్రపంచంలో ఉన్న 500 పెద్ద కంపెనీలు తెలంగాణ కు తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నామని పెట్టుబడులకు పూర్తి రక్షణ ఉంటుందని భరోసా ఇచ్చారు. తెలంగాణ అంటేనే వ్యాపారం అని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.
Film
చిరంజీవి విశ్వంభర సినిమా సెట్ లో కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న “భజే వాయు వేగం”(Bhaje Vaayu Vegam) సినిమా టీజర్ విడుదల
మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా యువి క్రియేషన్స్ సమర్పణలో హీరో కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న “భజే వాయు వేగం” సినిమా టీజర్ విడుదల
ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ మీద హీరో కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న “భజే వాయు వేగం” సినిమా టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి గారు రిలీజ్ చేశారు. విశ్వంభర(Vishwambhara) సినిమా సెట్ లో ఈ టీజర్ రిలీజ్ చేసిన మెగాస్టార్ టీజర్ తో పాటు టైటిల్ ఇట్రెస్టింగ్ గా, ఇప్రెసివ్ గా ఉందని చెప్పారు. తన అభిమాని, తమ్ముడు లాంటి కార్తికేయ హీరోగా నటించిన “భజే వాయు వేగం” సినిమా విజయం సాధించాలని మెగాస్టార్ తన బెస్ట్ విశెస్ అందించారు. “భజే వాయు వేగం”చిత్రంలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమాకు ప్రశాంత్ రెడ్డి చంద్రపు దర్శకత్వం వహిస్తున్నారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా టీజర్ విడుదల సందర్భంగా
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడుతూ | Megastar Chiranjeevi
యూవీ కాన్సెప్ట్స్ లో విక్కీ నిర్మాతగా, దర్శకుడు ప్రశాంత్ రెడ్డి చంద్రపు రూపొందిస్తున్న “భజే వాయు వేగం”(Bhaje Vaayu Vegam) సినిమా టీజర్, టైటిల్ ఆసక్తికరంగా, ఆకట్టుకునేలా ఉన్నాయి. నా అభిమాని, తమ్ముడు లాంటి కార్తికేయ హీరోగా నటిస్తున్న సినిమా ఇది. నా అభిమాని హీరోగా ఓ మంచి సినిమాలో నటిస్తున్నాడంటే ఆ సినిమా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ప్రశాంత్ రెడ్డి లాంటి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ టాలీవుడ్ కు రావాలి. ఇలాంటి యంగ్ డైరెక్టర్స్ ఎంతమంది కొత్త కాన్సెప్ట్స్ తో వస్తే అంత ఫ్రెష్ గా మన ఫిలిం ఇండస్ట్రీ ముందుకు సాగుతుంది. యంగ్ డైరెక్టర్స్ ను నేను ఎప్పుడూ ఆహ్వానిస్తుంటాను. “భజే వాయు వేగం” సినిమా టీజర్ చూస్తుంటే తండ్రీ కొడుకు మధ్య మంచి ఎమోషన్ తో సాగే సినిమా అనిపిస్తోంది. యాక్షన్ బాగుంది. ఈ సినిమా స్టోరీ నాకు తెలిసినా ఇంతకంటే ఎక్కువ లీక్ చేయాలనుకోవడం లేదు. “భజే వాయు వేగం” సినిమా టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా అని అన్నారు
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
“భజే వాయు వేగం”(Bhaje Vaayu Vegam) సినిమా టీజర్ ఎలా ఉందో చూస్తే – డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు, ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఆఫీసర్ హత్య కేసులో ప్రధాన నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు వేట ప్రారంభిస్తారు. మొత్తం పోలీస్ డిపార్ట్ మెంట్ అంతా ఇదే టాస్క్ మీద ఫోకస్ చేస్తుంది. మరోవైపు కార్తికేయ క్యారెక్టర్ ను పరిచయం చేస్తూనే తండ్రితో ఆయనకున్న ఎమోషనల్ బాండింగ్ ను చూపించారు. రాహుల్ టైసన్ క్యారెక్టర్ ఈ సినిమాలో కీలకంగా ఉండబోతున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒకడుంటాడు. వాడి కోసం ఏం చేయడానికైనా మనం వెనకాడం, నా లైఫ్ లో అది మా నాన్న అని కార్తికేయ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ఫాదర్, సన్ ఎమోషన్, హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్సులు టీజర్ కు హైలైట్ గా నిలిచాయి. టీజర్ లో హై క్వాలిటీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో పాటు కార్తికేయ గుమ్మకొండ ఎనర్జిటిక్ గా కనిపించారు. అన్ని ఎమోషన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ తో “భజే వాయు వేగం” సినిమా రూపొందించినట్లు టీజర్ తో తెలుస్తోంది.
“భజే వాయు వేగం” సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. థియేట్రికల్ రిలీజ్ డేట్ ను త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు.
నటీనటులు – కార్తికేయ గుమ్మకొండ, ఐశ్వర్య మీనన్, రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ తదితరులు
టెక్నికల్ టీమ్-
మాటలు: మధు శ్రీనివాస్
ఆర్ట్: గాంధీ నడికుడికర్
ఎడిటర్: సత్య జి
సినిమాటోగ్రఫీ: ఆర్.డి రాజశేఖర్
మ్యూజిక్ (పాటలు) – రధన్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ – కపిల్ కుమార్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్-శ్రీనివాస్)
కో ప్రొడ్యూసర్ – అజయ్ కుమార్ రాజు.పి
ప్రొడ్యూసర్: యూవీ కాన్సెప్ట్స్
దర్శకుడు: ప్రశాంత్ రెడ్డి చంద్రపు
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: చిరు చేతుల మీదుగా “భజే వాయు వేగం” సినిమా టీజర్ విడుదల
మహతి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నుండి యు. శ్రీనివాసుల రెడ్డి, బి. నాగేశ్వర రెడ్డి, వహీద్ షేక్, కే. పురుషోత్తం రెడ్డి నిర్మించిన ‘లక్ష్మీ కటాక్షం (Lakshmi Kataksham)’ ట్రైలర్ విడుదల అయ్యింది. ఓపెనింగ్ లోనే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎలక్షన్స్ డేట్ నే సినిమాలో ఎలక్షన్ డేట్ లాగా అనౌన్స్ చేశారు, ప్రముఖ నటుడు డైలాగ్ కింగ్ సాయి కుమార్ తన పాతికేళ్ళ పొలిటికల్ కెరీర్ ను నిలబెట్టుకోవడం కోసం ఈ ఎలక్షన్ ను చాలా ప్రశ్టేజ్ గా తీసుకుంటాడు, మరో పక్క పోలీస్ ఆఫీసర్ ఎలాగైనా ఈ ఎలక్షన్ లో ఒక్క రూపాయి కూడా పంచకుండా చూసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఆ పోలీస్ బందోబస్త్ నుండి, తక్కువ టైంలో 100 కోట్లని, రెండు లక్షల మంది ఓటర్లకు, ఓటుకు 5000 చొప్పున ఎలా పంచుతారు అనే నేపధ్యంలో సినిమా కథ ఉండబోతున్నట్టు ట్రైలర్లో తెలుస్తుంది, ఈ ట్రైలర్ లో కామెడీ తో పాటు హూకింగ్ డ్రామా కూడా ఉంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఒక పక్క సాయి కుమార్ కి ఎలక్షన్ ఫండ్ రావడం ఒక ఛాలెంజ్ అయితే, ఇంకో పక్క లాస్ట్ మినిట్ లో వచ్చిన ఫండ్ ఎలా పంచాలి అనేది ఇంకో ఛాలెంజ్, ఈ తరుణంలో చిరాకు పడి అన్ని దారులు మూసుకున్న సాయి కుమార్ లక్ష్మీ దేవిని ఎలక్షన్ ఫండ్ కటాక్షించమని డిమాండ్ చేస్తారు, లక్ష్మి దేవి ప్రత్యేక్షమవుతారు, ఇలాంటి విభిన్నమైన కథాంశాలతో సాగే ఈ ‘లక్ష్మీ కటాక్షం’ త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. ఈ సినిమాకి సూర్య రైటర్, డైరెక్టర్ గా వ్యవహరించారు. ట్రైలర్ లో డ్రామా పర్ఫెక్ట్ గా హైలైట్ అయ్యేలా మ్యూజిక్ అభిషేక్ రుఫుస్ అందించారు.
నటీ నటులు:
వినయ్
అరుణ్
దీప్తి వర్మ
చరిస్మా శ్రీకర్
హరి ప్రసాద్
సాయి కిరణ్ ఏడిద
ఆమనీ
సాంకేతిక నిపుణులు:
బ్యానర్: మహతి ఎంటర్టైన్మెంట్
నిర్మాతలు: యు. శ్రీనివాసుల రెడ్డి, బి. నాగేశ్వర రెడ్డి, వహీద్ షేక్, కే. పురుషోత్తం రెడ్డి
రచన, డైరెక్టర్: సూర్య
మ్యూజిక్: అభిషేక్ రుఫుస్
డి ఓ పి: నని ఐనవెల్లి
ఎడిటర్: ప్రదీప్ జే
సౌండ్ డిజైన్: మురళీధర్ రాజు
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఆర్. రంగనాథ్ బాబు
పి ఆర్ ఓ : ఏలూరు శ్రీను , ధీరజ్- ప్రసాద్
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- హ్యాపీ బర్త్ డే విజయ్ దేవరకొండ..స్టార్ గా, పర్సన్ గా విజయ్ దేవరకొండ జర్నీ ఎప్పుడూ ప్రత్యేకమే. ఒక్కొక్కటిగా ఆయన అనౌన్స్ చేస్తున్న భారీ పాన్ ఇండియా సినిమాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. హీరో కొత్త సినిమా ఆయన గత సినిమా సాధించిన బాక్సాఫీస్ కలెక్షన్స్ మీద, ఆ…
- రాయవలస టీజర్ చాలా కనెక్టింగ్ గా ఉంది.టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో ఆకాశ్ జగన్నాథ్ ………కార్తిక్ జయంతి ని హీరోగా పరిచయం చేస్తూ RaysuN ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “రాయవలస”. ఈ చిత్రాన్ని గోపీ కృష్ణ జె నిర్మించగా మహిళా దర్శకురాలు రాధిక జయంతి దర్శకత్వం వహించారు. “Love Tied by Fate” అనే ట్యాగ్‌లైన్…
- Motive for Murder (M4M) movie review …టాలీవుడ్లో ‘మల్లెపూవు’, ‘మెంటల్ కృష్ణ’, ‘కలవరమాయే మదిలో’ లాంటి సక్సెస్ఫుల్ సినిమాలను నిర్మించి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న మోహన్ వడ్లపట్ల దర్శకునిగా మారి తీసుకొచ్చిన మూవీ ఎం4ఎం (M4M – Motive For Murder). అమెరికన్ నటి జో శర్మ…
తెలుగు సంస్కృతిని ప్రతిబింబిస్తూ విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ ప్రతీ ఏటా వివిధ రంగాలలో ప్రజ్ఞాపాటవాలు కనబరిచిన వారికి ఉగాది అవార్డులను అనవా యితీగా అందజేస్తూ వస్తోంది. హైదరాబాద్ లో సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ గా పనిచేస్తున్న యు. వినాయకరావు ఫిలిం జర్నలిజంలో చేసిన సేవలకు గుర్తింపుగా విశ్వ గురు ఉగాది అవార్డుకు ఎంపుకయ్యారు. తన సుదీర్ఘమైన కెరీర్ లో చిత్ర పరిశ్రమ వికాసానికి దోహదం చేసే వార్తలను రాయడమే కాదు పలువురు ప్రముఖ నటీనటులపై రచయితగా పలు పుస్తకాలు రాసిన ఆయన లోగడ అనేక అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. ఆదివారం హైదరాబాద్, బేగంపేట టూరిజం ప్లాజాలో నిర్వహించిన ప్రత్యేక వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ హైకోర్టు జడ్జి శ్రీమతి శ్రీసుధ చేతుల మీదుగా వినాయకరావు ఈ ఉగాది అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా వినాయకరావు స్పందిస్తూ, ఇలాంటి అవార్డులు ప్రోత్సహంతో పాటు బాధ్యతలను గుర్తు చేస్తుంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పలు రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.
- హ్యాపీ బర్త్ డే విజయ్ దేవరకొండ..
- రాయవలస టీజర్ చాలా కనెక్టింగ్ గా ఉంది.టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో ఆకాశ్ జగన్నాథ్ ………
- Motive for Murder (M4M) movie review …
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కీర్తి కిరీటంలో మరో డైమండ్..
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉగాది సందర్భంగా ‘సారంగదరియా’(Sarangadaria) చిత్రం నుంచి లవ్ మెలోడీ సాంగ్ ‘నా కన్నులె..’(Naa Kannule) రిలీజ్
‘ నా కన్నులె (Naa Kannule) చూపించే కల నీలా ఉన్నదా ఈవేళ…’ అంటూ ప్రేమికుడు తన ప్రేయసిని చూసి మనసులోని భావాలను పాట రూపంలో చెప్పేస్తున్నాడు. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. వారి ప్రేమ చూడ ముచ్చటగా ఉంది. దాన్ని వెండితెరపై చూడాలంటే మాత్రం ‘సారంగదరియా’ సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందేంటున్నారు మేకర్స్.
రాజా రవీంద్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘సారంగదరియా’ చిత్రాన్ని సాయిజా క్రియేషన్స్ పతాకం పై చల్లపల్లి చలపతిరావు గారి దివ్య ఆశీస్సులతో ఉమాదేవి, శరత్ చంద్ర చల్లపల్లి నిర్మిస్తున్నారు. పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఉగాది సందర్భంగా ఈ మూవీ నుంచి ‘ నా కన్నులె (Naa Kannule) చూపించే కల నీలా ఉన్నదా ఈవేళ…’ లవ్ మెలోడీని విడుదల చేశారు. ఎం. ఎబెనెజర్ పాల్ సంగీత సారథ్యంలో కడలి రాసిన ఈ పాటను పి.వి.ఎన్. ఎస్. రోహిత్ పాడారు.
‘సారంగదరియా’ చిత్రం ఒక మధ్యతరగతి ఫ్యామిలీ లో జరిగిన కొన్ని ఘర్షణలున్నకథో రూపొందిన చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్. లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి..సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోందని దర్శక నిర్మాతలు తెలిపారు.
ఇది చదవండి : ‘టిల్లు స్క్వేర్’ తో మరింత ఉన్నత స్థాయికి వెళ్తావు సిద్ధు- జూ ఎన్టీఆర్
నటీనటులు
రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, యశస్విని, మొయిన్ ,మోహిత్, నీల ప్రియా, కదంబరి కిరణ్, మాణిక్ రెడ్డి, అనంతబాబు, విజయమ్మ , హర్షవర్ధన్, తదితరులు
సాంకేతిక వర్గం:
బ్యానర్ – సాయిజా క్రియేషన్స్, నిర్మాతలు – ఉమాదేవి, శరత్ చంద్ర చల్లపల్లి, దర్శకత్వం – పద్మారావు అబ్బిశెట్టి (పండు), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – అరుణాచల మహేష్, మాటలు – వినయ్ కొట్టి, ఎడిటర్ – రాకేష్ రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ – ఎం. ఎబెనెజర్ పాల్, సినిమాటోగ్రఫీ – సిద్ధార్థ స్వయంభు, పాటలు – రాంబాబు గోశాల, కడలి , అడిషనల్ రైటర్ – రఘు రామ్ తేజ్.కె
పి.ఆర్.ఒ – కడలి రాంబాబు, తుమ్మల మోహన్, చంద్ర వట్టికూటి.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
“లవ్ గురు”(Love Guru) ఫెంటాస్టిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ – హీరో విజయ్ ఆంటోనీ (Vijay Antony)
సరికొత్త కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తూ సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకత అని విజయ్ ఆంటోనీ (Vijay Antony) తెచ్చుకున్నారు. తను నటించిన ప్రతి సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు ఈ టాలెంటెడ్ హీరో విజయ్ ఆంటోనీ (Vijay Antony) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “లవ్ గురు”(Love Guru). ఆయన తొలిసారి రొమాంటిక్ ఎంటర్ టైనర్ జానర్ లో నటించిన చిత్రమిది. “లవ్ గురు” సినిమాలో మృణాళిని రవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను విజయ్ ఆంటోనీ (Vijay Antony) ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ నిర్మించారు. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా “లవ్ గురు” సినిమాను రంజాన్ పండుగ సందర్భంగా ఈ నెల 11న విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో సినిమాలోని హైలైట్స్ ను ఇంటర్వ్యూలో విజయ్ ఆంటోనీ తెలిపారు.
మనం ఒకటి కోరుకుంటే ఇంకొకటి దక్కవచ్చు…
నేను పర్సనల్ లైఫ్ లో, కెరీర్ లో ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచించను. వర్తమానంలోనే ఉంటాను. మనం ఒకటి కోరుకుంటే ఇంకొకటి దక్కవచ్చు. అప్పుడు నిరాశపడతాం. మనకు ఏది కావాలో, ఏది ఇవ్వాలో యూనివర్స్ చూసుకుంటుంది. ఈ సినిమా విషయంలోనూ అలాగే ఆలోచించా. కథ బాగా నచ్చింది. సినిమా రూపొందించాం. లవ్ గురు కథ విన్నప్పుడు ఈ సినిమా సాధించబోయే విజయం మీద నమ్మకం కలిగింది. అదే విషయాన్ని దర్శకుడు వినాయక్ కు చెప్పాను. నా కెరీర్ లో సక్సెస్ ఫుల్ సినిమాలు చేశాను. ఈ మూవీ కూడా సక్సెస్ అవుతుందనే హోప్ ఉంది. సినిమా అనేది బిడ్డ లాంటిది. మనం ఆ బిడ్డ బాగు కోసం చేయాల్సినవన్నీ చేయాలి. మా టీమ్ కూడా అలాగే మంచి సినిమా ప్రేక్షకులకు అందించాలని ప్రయత్నించాం.
మనల్ని ప్రేమించకున్న మనం ప్రేమించడమే ప్రేమ..
లవ్ గురులో ఫెంటాస్టిక్ ఫ్యామిలీ కామెడీ చూస్తారు. ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి చూస్తే తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. సినిమా చూశాక మీ జీవిత భాగస్వామిని ప్రేమించడం ఎలాగో తెలుసుకుంటారు. ప్రేమ అనేది లావాదేవీ కాదు ఒకటి ఇస్తే మరొకటి తిరిగి ఇవ్వడానికి. మనల్ని ప్రేమించకున్నా మనం ప్రేమించడమే ప్రేమ. లవ్ గురులో ఒక ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అదిప్పుడు రివీల్ చేయలేను. స్క్రీన్ మీద చూడాలి. దర్శకుడు తన లైఫ్ లో చూసిన అనుభవాలతో ఈ కథను రెడీ చేశాడు. ఆ కథ నన్ను ఆకట్టుకుంది.
లవ్ గురు అనేది క్యారెక్టర్ గురించి పెట్టిన టైటిల్ కాదు…
లవ్ గురు అనేది ఈ సినిమాలోని ఒక క్యారెక్టర్ గురించి పెట్టిన టైటిల్ కాదు. మొత్తం సినిమానే లవ్ గురు. ఈ సినిమా చూశాక ప్రేమించడం ఎలాగో నేర్పిస్తుంది. హీరో హీరోయిన్ ను పెళ్లి చేసుకుంటాడు. ఆమె అతన్ని లవ్ చేయడం లేదని మొదట తెలియదు. కొన్ని రోజులకు అతనంటే ఆమెకు ఇష్టం లేదని తెలుస్తుంది. అయితే మరికొద్ది రోజులు ఆగితే తనను అర్థం చేసుకుని ప్రేమిస్తుందని ఆశిస్తాడు హీరో. కానీ ఆమె ఎప్పటికీ అతన్ని ప్రేమించదు. అప్పుడు హీరో ఏం చేశాడు, వారి మధ్య రిలేషన్ ఎలా సాగింది అనేది ఇంట్రెస్టింగ్ గా సాగే లవ్ గురు స్టోరీ లైన్.
తోటి వారిని ప్రేమిస్తే చివరకు అది మనకే మంచి చేస్తుంది..
మనల్ని మనం ప్రేమించుకుంటే మిగతా వారినీ ప్రేమిస్తాం. తోటి వారిని ప్రేమిస్తే చివరకు అది మనకే మంచి చేస్తుంది. మన శరీరం ఎన్నో ఎంజైమ్స్, విటమిన్స్ ఇస్తూ మనల్ని కాపాడుతుంది. మనలో సానుకూల దృక్పథం ఉన్నప్పుడే శరీరం స్పందించే తీరు బాగుంటుంది. అందుకే నెగిటివ్ పీపుల్ తో ఉన్నా మనం పాజిటివ్ గా ఉండేందుకు ప్రయత్నించాలి. ఒకరు నిన్ను మోసం చేసినా చివరకు తప్పు తెలుసుకుంటారు. ఈ కథలో హీరో క్యారెక్టర్ కూడా ప్రేమను పంచుతుంది. ప్రేమిస్తుంది. అతన్ని ద్వేషించినా వారిని లవ్ చేస్తుంది.
మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా లవ్ గురు సినిమా రిలీజ్..
ఈ సినిమాలో డైలాగ్స్ చాలా సహజంగా ఉంటాయి. దర్శకుడు వినాయక్ న్యాచురల్ గా డైలాగ్స్ రాశారు. భార్య భర్తలు ఎలా మాట్లాడుకుంటారో అలాగే ఉంటాయి. అయితే నా దృష్టిలో మాటల కన్నా ఆ మాటల్లోని భావం ముఖ్యం. లవ్ గురులో ఆ సీన్ లో చెప్పాల్సిన మ్యాటర్ ను డైలాగ్స్ పర్పెక్ట్ గా ప్రేక్షకులకు కన్వే చేస్తాయి. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా లవ్ గురు సినిమాను రిలీజ్ చేస్తుండటం సంతోషంగా ఉంది. నేను ఎప్పటి నుంచో ఈ సంస్థతో అసోసియేట్ అవడానికి ఎదురుచూస్తున్నాను. సినిమా పట్ల ప్యాషన్ ఉన్న బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్. నేను తమిళంలో మూవీస్ చేస్తుంటాను. ఇక్కడ రిలీజ్ కు సరైన వాళ్లు దొరకక ఇబ్బందులు పడ్డాను. మైత్రీ డిస్ట్రిబ్యూషన్ తో ఇకపైనా మా రిలేషన్ కొనసాగుతుంది.
నేను ఫ్యూచర్ లో ఎంత గొప్ప సినిమా చేసినా అది బిచ్చగాడు సినిమా కంటే గొప్ప మూవీ కాలేదు..
నాకు మెమొరీ పవర్ తక్కువ. తెలుగు భాష నేర్చుకోలేకపోయాను. నాకు తెలుగు వచ్చి ఉంటే తెలుగులోనే నేరుగా సినిమాలు చేసేవాడిని. అలాంటి అవకాశం ఉంటే చెన్నై వదిలి వచ్చి ఇక్కడే సినిమాలు చేస్తా. నేనొక సినిమా చేస్తే ఆ సినిమాకు నిర్మాణ బాధ్యతలు, ఎడిటింగ్, నటించడం, అన్ని భాషల్లో ప్రమోషన్ చేయడం వీటికే టైమ్ సరిపోతోంది. నేను ఫ్యూచర్ లో ఎంత గొప్ప సినిమా చేసినా అది బిచ్చగాడు సినిమా కంటే గొప్ప మూవీ కాలేదు. అయితే లవ్ గురు కూడా నాకు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని అందిస్తుంది. ఇందులో లేడీస్ సెంటిమెంట్ ఉంటుంది.
2026 సమ్మర్ లో బిచ్చగాడు 3 సినిమా…
బిచ్చగాడు సినిమాతో చూస్తే కనీసం 80 శాతం ఎమోషన్ లవ్ గురు కథలోనూ ఉంది. 2026 సమ్మర్ లో బిచ్చగాడు 3 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నా. నా కెరీర్ లో బిచ్చగాడు 3 బిగ్గెస్ట్ మూవీ అవుతుంది. ఈ సినిమాకు నేనే దర్శకత్వం చేస్తాననుకుంటా. ప్రస్తుతం మా ప్రొడక్షన్ మూడు సినిమాలు లైనప్ లో ఉన్నాయి. ఒకటి అక్టోబర్ లో మరొకటి సంక్రాంతికి ఇంకో సినిమా నెక్ట్ సమ్మర్ లో రిలీజ్ చేయబోతున్నాం.
ఇది చదవండి : ఆహా లో కాజల్, రెజీనాల ‘కాజల్ కార్తిక’ మూవీ.. ఎప్పటి నుంచి అంటే..!
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
‘కమిటీ కుర్రోళ్లు’ టైటిల్ పోస్టర్ విడుదల చేసిన సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్..
‘కమిటీ కుర్రోళ్లు’(Committee Kurrollu) :
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందుతోన్నచిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’ టైటిల్ పోస్టర్ విడుదల చేసిన సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై ప్రొడక్షన్ నెం.1 చిత్రానికి ‘కమిటీ కుర్రోళ్లు’ (Committee Kurrollu) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ విడుదల చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలుత తెలిపారు. ఈ సందర్భంగా…
నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ..
‘‘మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద చేసిన తొలి సినిమా కమిటీ కుర్రోళ్లు. ఉగాది సందర్భంగా టైటిల్ పోస్టర్ విడుదల చేశాం. పోస్టర్ విడుదల చేసిన హీరో సాయి దుర్గా తేజ్‌గారికి థాంక్స్. శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ వారు కలిసి ఈ సినిమాను నిర్మించటం చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంది కొత్త వాళ్లతో సినిమా చేయటం పెద్ద బాధ్యతగా భావిస్తున్నాం. సినిమాకు ‘కమిటీ కుర్రోళ్లు’ అనే టైటిల్ పెట్టాం. అలాంటి టైటిల్ ఎందుకు పెట్టామనేది సినిమా చూడాల్సిందే. యదు వంశీగారు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తప్పకుండా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాం’’ అన్నారు.
చిత్ర దర్శకుడు యదు వంశీ మాట్లాడుతూ..
‘‘టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసిన సాయి దుర్గా తేజ్ గారికి థాంక్స్. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై కమిటీ కుర్రోళ్లు సినిమా చేస్తున్నాం. కొత్తవాళ్లతో ఈ సినిమా చేయటం ఆనందంగా ఉంది. ఇందులో 11 మంది హీరోలు, 4 హీరోయిన్స్‌ని పరిచయం చేస్తున్నాం. నాకు ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుంటామని నమ్ముతున్నాం. షూటింగ్ పూర్తయ్యింది’’ అన్నారు.
శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ ఫణి, జయలక్ష్మి మాట్లాడుతూ..
‘‘ మా మూవీ కమిటీ కుర్రోళ్లు సినిమా టైటిల్ పోస్టర్ విడుదల చేసిన హీరో సాయి దుర్గా తేజ్‌కి ధన్యవాదాలు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రొడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చాం. ఈ జర్నీలో పింక్ ఎలిఫెంట్ మాకు తోడుగా రావటం చాలా హ్యాపీగా ఉంది. కంటెంట్ ఈజ్ కింగ్. అందువల్లే డిఫరెంట్ కంటెంట్ చేసిన మా సినిమాకు ‘కమిటీ కుర్రోళ్లు’ అనే టైటిల్ పెట్టాం. పోస్టర్ విడుదల చేశాం. తప్పకుండా సినిమా అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది’’ అన్నారు.
నటీనటులు :
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, శరణ్య సురేష్, తేజస్వి రావు, టీన శ్రావ్య, విషిక, షణ్ముకి నాగుమంత్రి .. ముఖ్య పాత్రల్లో సాయి కుమార్ , గోపరాజు రమణ, బలగం జయరాం, శ్రీ లక్ష్మి , కంచెరపాలెం కిషోర్ , కిట్టయ్య , రమణ భార్గవ్, జబర్దస్త్ సత్తి పండు తదితరులు
సాంకతిక వర్గం :
సమర్పణ – నిహారిక కొణిదెల, బ్యానర్స్- పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ ఎల్ పి, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, నిర్మాతలు – పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక, రచన, దర్శకత్వం – యదు వంశీ, సినిమాటోగ్రఫీ – రాజు ఎడురోలు, మ్యూజిక్ డైరెక్టర్ – అనుదీప్ దేవ్, ప్రొడక్షన్ డిజైనర్ – ప్రణయ్ నైని, ఎడిటర్ – అన్వర్ అలీ, డైలాగ్స్ – వెంకట సుభాష్ చీర్ల, కొండల రావు అడ్డగళ్ల, ఫైట్స్ – విజయ్, నృత్యం – జె.డి మాస్టర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – మన్యం రమేష్, పి ఆర్ ఒ- బియాండ్ మీడియా (నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి).
ఇది చదవండి : కన్నడ బ్లాక్ బస్టర్ లవ్ మోక్టైల్ 2 మూవీ నుంచి ‘నీదేలే నీదేలే…
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ల్యాండ్‌మార్క్ 75వ చిత్రం కోసం సితార ఎంటర్టైన్మెంట్స్తో చేతులు కలిపిన రవితేజ…
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) తన ల్యాండ్‌మార్క్ 75వ చిత్రం కోసం సితార ఎంటర్టైన్మెంట్స్తో చేతులు కలిపారు..
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) తన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్, మాస్ యాటిట్యూడ్, విలక్షణమైన డైలాగ్ డెలివరీతో రెండున్నర దశాబ్దాలకు పైగా అలరిస్తూ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. హాస్యాన్ని పండించడంలో రవితేజ(Ravi Teja)ది విభిన్న శైలి. అలాంటి విలక్షణమైన శైలిలో పూర్తిస్థాయి వినోదభరిత పాత్రలో మాస్ మహారాజాను చూడటానికి ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
విభిన్న తరహా చిత్రాలతో తన అభిమానులను, సినీ ప్రేమికులను అలరించేందుకు అవిశ్రాంతంగా వరుస చిత్రాలు చేసుకుంటూ వెళ్ళడం రవితేజకు అలవాటు. ఇప్పుడు, ఆయన తన కెరీర్లో 75వ చిత్రం మైలురాయిని చేరుకోవడానికి సిద్ధమయ్యారు. తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకొని రవితేజ ల్యాండ్‌మార్క్ చిత్రం ప్రకటన వచ్చింది. ఇది రవితేజ శైలిలో ఉండే మాస్ ఎంటర్టైనర్. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అనౌన్స్మెంట్ పోస్టర్ చూస్తేనే, ఈ సినిమా ‘దావత్’లా ఉండబోతుందనే అభిప్రాయం కలుగుతోంది.
ఇది చదవండి : మే లో రిలీజ్ కు రెడీ అవుతున్న ” RK పురం లో…
భారీస్థాయిలో నిర్వహించబడుతున్న ఊరి జాతరను చూపిస్తూ, సృజనాత్మకంగా రూపొందించిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. రవితేజ 75వ చిత్రం అని తెలుపుతూ కళ్ళద్దాల మీద ‘RT 75’ అని రాయడం బాగుంది. అలాగే పోస్టర్ మీద “రవన్న దావత్ ఇస్తుండు.. రెడీ అయిపోండ్రి”, “హ్యాపీ ఉగాది రా భయ్” అని తెలంగాణ యాసలో రాసి ఉండటం గమనించవచ్చు. దీనిని బట్టి చూస్తే తెలంగాణ నేపథ్యంలో సాగే చిత్రమని అర్థమవుతోంది. ఈ సినిమాలో రవితేజ పాత్ర పేరు “లక్ష్మణ భేరి” అని తెలిపిన మేకర్స్.. ఈ పాత్ర తీరు ఎలా ఉండబోతుందో కూడా ఉగాది పంచాంగం రూపంలో చెప్పారు. “ఆదాయం: చెప్పను తియ్.. ఖర్చు: లెక్క జెయ్యన్.. రాజ్యపూజ్యం: అన్ లిమిటెడ్.. అవమానం: జీరో” అంటూ రవితేజ పోషిస్తున్న పాత్ర గురించి పోస్టర్ పై రాసుకొచ్చిన తీరు భలే ఉంది.
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రతిభావంతులైన స్వరకర్త భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. 2025 సంక్రాంతికి ఈ చిత్రం “ధూమ్ ధామ్ మాస్” దావత్ అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సినిమాలతో ఆకట్టుకోనున్న బెల్లంకొండ శ్రీనివాస్..
బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సినిమాలతో ఆకట్టుకోనున్న బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Srinivas)…ఏకంగా మూడు చిత్రాలు!
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Srinivas) తన నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అల్లుడు శీను, జయ జానకి నాయక, రాక్షసుడు వంటి హిట్ సినిమాలతో దూసుకుపోయాడు. ఈ సినిమాల్లో.. అతని నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. కాగా శ్రీనివాస్ (Bellamkonda Srinivas) హీరోగా ఎంట్రీ ఇచ్చి (2024) పది సంవత్సరాలు పూర్తయింది. మొదటి నుండి శ్రీనివాస్ తన సిక్స్-ప్యాక్ బాడీతో ప్రభాస్ మరియు అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల లిస్ట్‌లో చేరిపోయాడు. ఇందుకు తన కఠినమైన వ్యాయామం, దినచర్యలు, తన అంకిత భావమే కారణం అని చెప్పాలి. ఫిట్నెస్ విషయంలో అతను చాలా నిబద్ధతతో ఉంటాడు.
ఇది చదవండి : కన్నడ బ్లాక్ బస్టర్ లవ్ మోక్టైల్ 2 మూవీ నుంచి ‘నీదేలే నీదేలే…
ఇక ఈ హీరో తన క్రేజ్‌ని పెంచుకోవాడనికి.. ఛత్రపతి సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. SS రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా అతనికి బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం శ్రీనివాస్..14 రీల్స్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌పై వస్తున్న ‘టైసన్ నాయుడు’ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో పూర్తి కానుంది. దీంతోపాటు షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్స్‌తో మరియు మూన్‌షైన్ పిక్చర్స్‌తో చేతులు కలిపాడు.
వీటి కోసం.. మునుపెన్నడూ చూడని లుక్‌లో శ్రీనివాస్ కనిపించనున్నాడు అని తెలుస్తుంది. ఇవీ అన్నీ కూడా చాలా ప్రత్యకమైన కథలు అని, ఇవి అతని కెరీర్లో కొత్త అధ్యాయాన్ని క్రియేట్ చేస్తాయి అని అంటున్నారు. యాక్షన్-ఓరియెంటెడ్ మరియు కంటెంట్-డ్రైవెన్ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. శ్రీనివాస్ రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఈ సినిమాలు ఆయనకు మంచి కమ్ బ్యాక్ మూవీలు అవుతున్నాయి అని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
డెబ్బై శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న “లగ్గం”(Laggam) !!!
సుభిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా లగ్గం (Laggam). ఈ సినిమాకు రమేశ్ చెప్పాల రచన – దర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణ పెళ్లిలో ఉండే సంబురాన్ని విందుని, చిందుని, కన్నుల విందుగా చూపించబోతున్నారు. ఇది కల్చరర్ ఫ్యామిలీ డ్రామా ప్రతి ఒక్కరు ఈ చిత్రం చూసి మాట్లాడుకుంటారు, కొత్త ఎక్స్పీరియన్స్ కళ్ళముందు ఉంచే ఈ చిత్రం. కొన్ని తరాలు గుర్తుంచుకునే చిత్రమవుతుందని దర్శకుడు రమేష్ చెప్పాల తెలిపారు.
కామారెడ్డి, జనగామ, బీబీపేట ఇస్సానగర్ ప్రాంతాల్లో.. పచ్చని పొలాలు, ఆహ్లాదకరమైన వాతావరణంలో వేసిన సెట్స్ మధ్య 70% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇటీవల మూడు సాంగ్స్ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఏప్రిల్ 11 నుండి నూతన షెడ్యూల్ ప్రారంభం కానుంది…
ఇది చదవండి : FNCC ఆల్ ఇండియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ గ్రాండ్ ఓపెనింగ్ చేసిన హీరో…
తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్ కు మంచి స్పందన లభిస్తోంది. సీనియర్ ఆర్టిస్టులు రాజేంద్రప్రసాద్, రోహిణి, ఎల్.బి శ్రీరామ్ తదితరులు నటించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించనుందని చిత్ర యూనిట్ తెలుపుతుంది.
ఈ చిత్రానికి కథ – మాటలు స్క్రీన్ ప్లే- దర్శకత్వం రమేశ్ చెప్పాల, సంగీతం: చరణ్ అర్జున్, ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి. కెమెరామెన్: బాల్ రెడ్డి. ఆర్ట్: కృష్ణ సాహిత్యం: కాసర్ల శ్యామ్. సంజయ్ మహేశ్ వర్మ కొరియోగ్రఫీ: అజయ్ శివశంకర్.
నటీనటులు:
సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్, రోహిణి, సప్తగిరి, ఎల్బిశ్రీరామ్, కృష్ణుడు, రఘుబాబు, రచ్చ రవి, కనకవ్వ, వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చoద్ర, చిత్రం శ్రీను, సంధ్య గంధం, టి. సుగుణ ,లక్ష్మణ్ మీసాల, ప్రభావతి. కంచరపాలెం రాజు, ప్రభాస్ శ్రీను, సత్తన్న తదితరులు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 70908