ఇండియన్ మొబైల్ మార్కెట్లో కొరియన్ మొబైల్ దిగ్గజం శామ్సంగ్ కంపెనీ టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. అయితే వచ్చే ఏడాది రానున్న గెలాక్సీ S24 సిరీస్ ఫోన్లతో రెండు పాపులర్ AI చాట్బాట్లను పరిచయం చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం టెక్ ఇండస్ట్రీ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) చుట్టూ తిరుగుతోంది. దాదాపు అన్ని రంగాలూ ఏఐ అడ్వాన్స్మెంట్ను సద్వినియోగం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఓపెన్ఏఐ చాట్‌జీపీటీ, గూగుల్ బార్డ్ చాట్బాట్లతో ఈ ట్రెండ్ మరింత ఊపందుకుంది. ఇప్పుడు మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కూడా కస్టమర్లకు ఈ ఫీచర్లను చేరువ చేస్తున్నాయి. ఈ విషయంలో గూగుల్ ముందుండగా, శామ్సంగ్ కూడా స్మార్ట్ఫోన్లలో ఏఐని ఇంట్రడ్యూస్ చేసే ప్లాన్‌లో ఉంది. బడ్జెట్ ఫ్రెండ్లీ నుంచి ఫ్లాగ్షిప్ డివైజ్‌ల వరకూ అని సెగ్మెంట్స్‌లో ఈ బ్రాండ్ ఆకట్టుకుంటోంది. కానీ శామ్సంగ్ స్మార్ట్ఫోన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)ని ఇంట్రడ్యూస్ చేయడంలో కాస్త ఆలస్యం చేసింది.
Read Also..