87
బట్టలు ఉతకడం పూర్తయ్యాక వాషింగ్ మెషిన్ మూతను వెంటనే మూసేయడం సాధారణంగా అందరూ చేసే పనే.. అయితే, ఇలా వెంటనే మూసేయడం మంచిది కాదని చెబుతున్నారు. దీనివల్ల మెషిన్ లో గాలి బయటకు పోయే అవకాశం ఉండదని, దీంతో దుర్వాసన వస్తుందని నిపుణులు అంటున్నారు. మరోసారి మెషిన్ ను ఉపయోగించినపుడు ఈ దుర్వాసన బట్టలకు అంటుకుంటుందని హెచ్చరించారు. వాషింగ్ మెషిన్ తో పని పూర్తయ్యాక కనీసం 40 నుంచి 45 నిమిషాల పాటు మెషిన్ డోర్ తెరిచిపెట్టడం వల్ల దుర్వాసన రాకుండా జాగ్రత్త పడవచ్చని నిపుణులు తెలిపారు. మిగతా పరికరాలను శుభ్రం చేసినట్లే దీనిని కూడా తరచూ శుభ్రం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉపయోగించిన తర్వాత ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటే మెషిన్ ఎక్కువ కాలం మన్నుతుందని చెబుతున్నారు.