బట్టలు ఉతకడం పూర్తయ్యాక వాషింగ్ మెషిన్ మూతను వెంటనే మూసేయడం సాధారణంగా అందరూ చేసే పనే.. అయితే, ఇలా వెంటనే మూసేయడం మంచిది కాదని చెబుతున్నారు. దీనివల్ల మెషిన్ లో గాలి బయటకు పోయే అవకాశం ఉండదని, దీంతో దుర్వాసన వస్తుందని నిపుణులు అంటున్నారు. మరోసారి మెషిన్ ను ఉపయోగించినపుడు ఈ దుర్వాసన బట్టలకు అంటుకుంటుందని హెచ్చరించారు. వాషింగ్ మెషిన్ తో పని పూర్తయ్యాక కనీసం 40 నుంచి 45 నిమిషాల పాటు మెషిన్ డోర్ తెరిచిపెట్టడం వల్ల దుర్వాసన రాకుండా జాగ్రత్త పడవచ్చని నిపుణులు తెలిపారు. మిగతా పరికరాలను శుభ్రం చేసినట్లే దీనిని కూడా తరచూ శుభ్రం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉపయోగించిన తర్వాత ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటే మెషిన్ ఎక్కువ కాలం మన్నుతుందని చెబుతున్నారు.
Tag:
washing machine
2050 నాటికి వాషింగ్ మెషీన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్ల వంటి ఇతర వస్తువులను అధిగమించి, భారతదేశంలో ఎయిర్ కండిషనర్ల సంఖ్య తొమ్మిది రెట్లు పెరుగుతుందని అంచనా. 2010 నుంచి ఇళ్లలో వినియోగిస్తున్న ఏసీల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. ప్రస్తుతం భారతదేశంలోని ప్రతి 100 కుటుంబాలలో 24 కుటుంబాలు ఎయిర్ కండిషనర్ వినియోగిస్తున్నాయి. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (IEA) రిపోర్ట్ ప్రకారం.. 2019, 2022 మధ్య కూలింగ్ స్పేసెస్ ఎనర్జీ కన్సమ్షన్ 21 శాతం పెరిగింది. అందరూ ఆర్థిక స్థిరత్వం, ఆదాయం పెరిగేకొద్దీ సౌకర్యాలు సమకూర్చుకోవడం సాధారణమే. ప్రస్తుతం భారతదేశంలో చాలా మంది ఎయిర్ కండిషనర్లు(AC) కొనుగోలు చేస్తున్నారు.





Total views : 77905