టెక్ దిగ్గజం గూగుల్, తన సర్వీసెస్, ప్లాట్‌ఫారమ్స్ అందించే ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరిచేందుకు నిరంతరం కృషి చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో టాప్ పొజిషన్లో ఉన్న వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫారం యూట్యూబ్ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇంప్రూవ్ చేయడానికి కొత్త జనరేటివ్ AI ఫీచర్లను డెవలప్ చేస్తోంది. ఈ అడ్వాన్స్డ్ ఆప్షన్లను ముందుగానే ఎక్స్పీరియన్స్ చేసే అవకాశాన్ని సెలక్టెడ్ యూజర్లకు అందించింది. కొత్త ఫీచర్స్ బెనిఫిట్స్, యాక్సెస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. కొత్త ఫీచర్లలో ఒకటి ఏంటంటే, ఎక్స్టెన్సివ్ కామెంట్ థ్రెడ్స్తో యూట్యూబ్ వీడియోల కామెంట్స్ కేటగరైజ్ చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగిస్తుంది. ఈ AI-బేస్డ్ టూల్ కామెంట్స్‌ని థీమ్స్ లేదా టాపిక్స్‌గా విభజిస్తుంది. యూజర్లు ఈజీగా డిస్కషన్స్‌లో పాల్గొనే సదుపాయం కల్పిస్తుంది. అంతేకాకుండా, కంటెంట్ క్రియేటర్లు ఈ కామెంట్ సమ్మరీల ద్వారా ఆడియన్స్‌తో సులువుగా ఎంగేజ్ కావచ్చు. కంటెంట్ కోసం ఫ్రెష్ ఇన్స్పిరేషన్ కనుగొనడానికి ఉపయోగించుకోవచ్చు.
యూట్యూబ్‌లో కొత్తగా 2 జనరేటివ్ AI ఫీచర్లు.. టెస్ట్ చేస్తున్న గూగుల్
80
previous post