మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజాలు ఏఐలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. పోటాపోటీగా ప్రొడక్టులు, సర్వీసులను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా గూగుల్ ఏఐ రంగంలో మరో అద్భుత ఆవిష్కరణకు తెరలేపింది. టెక్స్ట్‌తో వీడియోలు క్రియేట్ చేసే ఏఐ మోడల్‌ను కంపెనీ డెవలప్ చేస్తోంది. ఇప్పటికే బార్డ్ పేరుతో ఏఐ చాట్‌బాట్‌ను లాంచ్ చేసిన గూగుల్ ఇప్పుడు కొత్త AI మోడల్ ‘లూమియర్’ను డెవలప్ చేస్తోంది. ఇది Space-Time-U-Net అనే డిఫ్యూజన్ మోడల్‌ను ఉపయోగిస్తుంది. ఇది వీడియోలోని క్లిష్టమైన వివరాలను చూసి తగిన మార్పులు చేస్తుంది. వాస్తవానికి గూగుల్ AI మోడల్ ప్రాంప్ట్‌లను ఉపయోగించి కొన్ని సెకన్ల క్లిప్‌ను క్రియేట్ చేయగలదు. ఇటీవల బాగా పాపులర్ అయిన ఇతర ఇమేజ్ జనరేటింగ్ AI మోడల్స్ మాదిరిగానే ఉంటుంది. గూగుల్ లేటెస్ట్ ఇన్నొవేషన్ లూమియర్ ప్రయోజనాలు, పనితీరు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. లూమియర్ ఇతర ప్లాట్‌ఫారమ్‌ల కంటే భిన్నంగా ఉంటుంది. ఇందులో కంటెంట్‌ను జనరేట్ చేయవచ్చు, ఎడిట్ కూడా చేయవచ్చు. గూగుల్ ఏఐ టెక్ కంటెంట్ రియల్ లైఫ్ అనుభూతిని అందిస్తుంది. ఉదాహరణకు ఏదైనా వస్తువు నీటిలో కదులుతున్న ఫీల్‌ను అందించగలదు. గూగుల్ STUNet టైమ్ ఆధారంగా మూవ్‌మెంట్స్‌పై ఫోకస్ చేస్తుంది. ఈ ప్రొడక్టును ఉత్తమంగా నిలిపేందుకు గూగుల్ ప్రయత్నిస్తోంది. ఇంకా ఇంటర్నల్ టెస్టులు జరుగుతున్నాయి. గూగుల్ AI మోడల్లో మరో కీలక అంశం ఏంటంటే కంటెంట్‌లో కొంత భాగాన్ని యానిమేట్ చేయవచ్చు లేదా స్టైలిష్ట్ టచ్ ఇవ్వొచ్చు. అంటే ఇమేజ్-టు-వీడియో జనరేషన్ కోసం కూడా దీన్ని ఉపయోగించవచ్చు.
టెక్స్ట్‌తో వీడియోలు క్రియేట్ చేసే టూల్..!
56
previous post