మైక్రో సాఫ్ట్ సాఫ్ట్ వేర్ లో సాంకేతిక లోపం సమస్య తలెత్తింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు ప్రస్తుతం బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ బారిన పడుతున్నాయి. సైబర్ సెక్యూరిటీ కంపెనీ క్రౌడ్ స్ట్రైక్ ఒక అప్డేట్ను విడుదల చేసింది. దాని తర్వాత MS Windowsలో నడుస్తున్న అన్ని కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు అకస్మాత్తుగా క్రాష్ అవుతున్నాయి. పని చేస్తున్నప్పుడు ల్యాప్‌టాప్‌లు షట్ డౌన్ అవుతున్నాయి. దీని తర్వాత వినియోగదారులు బ్లూ స్క్రీన్‌ను చూస్తున్నారు. మీ కంప్యూటర్ సమస్యలో ఉందని, రీస్టార్ట్ చేయాల్సిన అవసరం ఉందని స్క్రీన్ చెబుతోంది. ఈ ప్రక్రియనే బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ BSODఅంటారు. ఈ సమస్య కారణంగా, మైక్రోసాఫ్ట్ విండోస్‌లో నడుస్తున్న ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు ప్రపంచవ్యాప్తంగా ప్రభావితమయ్యాయి. క్రౌడ్ స్ట్రైక్ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది. భారత్ సహా అమెరికా, ఆస్ట్రేలియాలోనూ ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ, బ్యాంకులు తదితర సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. మైక్రోసాఫ్ట్ విండోస్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడుతోంది. విమాన సేవలు ఆలస్యం, క్యాన్సిలేషన్లకు గురవుతున్నాయి.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్.దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. వచ్చే నెల 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొనే అవకాశమున్నట్లు సమాచారం. 2019లో చివరిసారిగా భారత్‌కు వచ్చిన షీ జిన్‌పింగ్,…
- పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. సముద్ర వేటకు వెళ్లిన బోటు.. ఇసుకదిబ్బను ఢీకొనడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి.. ఈదుకుంటూ ఒడ్డుకు…
- 22ఏపై బీజేపీ దీక్షలు.భూ భారతి పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సెక్షన్ 22ఏ కింద లక్షలాది ఎకరాల భూములను ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ధరణి పోర్టల్‌పై నిర్వహించిన…
- సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముందు వెళ్తున్న కంటైనర్‌ను అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా..…
- భారత సైన్యం చేతికి ‘షేర్’.. ఏకే-203 రైఫిళ్లు రెడీ.రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లా కోర్వాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో దేశీయంగా తయారైన ఏకే-203 అసాల్ట్ రైఫిళ్లు భారత సైన్యానికి అందించేందుకు సిద్ధమయ్యాయి. త్వరలోనే వీటి డెలివరీ ప్రారంభం కానుంది. అత్యాధునికమైన…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి