ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామంలో ఓ 15వ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ ఇంటిని టార్గెట్ చేసిన దొంగలు సుమారు 12 లక్షల రూపాయల విలువ గల 210 గ్రాముల బంగారాన్ని అపహరించారు. కొమరం లక్ష్మణరావు గంగారం 15వ బెటాలియన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. అక్కడికి సమీపం లోని బేతుపల్లి గ్రామంలో తన కుటుంబ సభ్యులతో కలిసి సొంత ఇంట్లో నివసిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఓ ఫంక్షన్ నిమిత్తం ఊరు వెళ్లి తిరిగి ఇంటికి రాగా బీరువా పగలగొట్టి బంగారం, నగదు అపహరణకు గురై ఉండటాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు 210 గ్రాముల బంగారం, 25వేల రూపాయల నగదు అపహరణకు గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రామం లోని దొడ్డ శ్రీను అనే మరో వ్యక్తి ఇంట్లో సైతం దొంగలు చోరీ యత్నించారు. బంగారం వంటి విలువైన సామాగ్రి దొరకపోవడంతో ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Also..