రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 30న ఎన్నికలు జరగనున్నాయి. భాగంగా మునుగోడు నియోజకవర్గం లో ఎన్నికల ప్రక్రియ నిర్వహించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఎన్నికల సామాగ్రి అంత ఈరోజు ఆయా పోలింగ్ కేంద్రాలకు వెళుతుంది. ప్రస్తుతం ఆ ఏర్పాట్లలోనే అధికారులు నిమగ్నమై ఉన్నారు. మునుగోడు నియోజకవర్గం లో మొత్తం 39 అభ్యర్థులు బరిలో ఉన్నారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా 2,52,648 ఓటర్లు కలరు. పురుషులు 1,26,223
మహిళలు 1,26,421 ట్రాన్స్ జెండర్స్04 ఉన్నారు. మునుగోడు నియోజకవర్గం వ్యాప్తంగా 207 పోలింగ్ ప్రదేశాలు కలవు, 307 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలలో మౌలిక సదుపాయాలు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. సమస్య ఆత్మక పోలి కేంద్రాలుగా 112 గుర్తించారు. దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. మహిళా పోలింగ్ కేంద్రాలు 5, మోడల్ పోలింగ్ కేంద్రాలు 5,యూత్ కేంద్రం 1. మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా 30 రూట్స్ ఏర్పాటు చేశారు ప్రతి రూటుకి నలుగురు చొప్పున మొత్తం 1,228 మంది పోలింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. 201 వెబ్ కాస్టింగ్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మైక్రో అబ్జర్వర్ 71మెంబర్స్,ఎక్స్ సర్వీస్ మెంబర్స్ 51 మెంబర్స్ నియమించారు. నియోజకవర్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఐదు అంచల పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తం 2500 మంది పైగా పోలీస్ సిబ్బంది పనిచేస్తున్నారు. ఈవీఎంలు తీసుకెళ్లి రూట్ బస్సులకు జియో ట్యాబ్లెట్ ఏర్పాటు చేశారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా 1300 మంది పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించుకున్నారు. 550మంది ఎన్నికల నిర్వహిస్తున్న అధికారులు ఉపయోగించుకున్నారు.
రేపు ఎన్నికలకు రంగం సిద్ధం..
61
previous post