కరీంనగర్ లో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ వారోత్సవాలు.

కరీంనగర్ లో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ వారోత్సవాలు

Advertisements

<p>యువత తాత్కాలిక ఆనందం కోసం మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తమ బంగారు జీవితాలను నాశనం చేసుకోవద్దని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు&period; అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ వారోత్సవాలలో భాగంగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రయివేటు పాఠశాలలో నిషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు&period; పోలీస్ శాఖ మరియు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి సీపీ గౌస్ ఆలం&comma; సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి లు ముఖ్య అతిధిగా హాజరై&&num;8230&semi; జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు&period; కరీంనగర్ కలెక్టరేట్ నుంచి తెలంగాణ చౌక్ మీదుగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు ర్యాలీ కొనసాగింది&period; తెలంగాణ చౌక్ వద్ద నర్సింగ్ విద్యార్థులు ప్రదర్శించిన స్కిట్ అందరిని ఆలోచించేలా చేసింది&period; పాఠశాల&comma; కళశాల విద్యార్థులు&comma; వైద్య విద్యార్థులు యువత&comma; పోలీస్ అధికారులు భారీ ర్యాలీ లో పాల్గొన్నారు&period; డ్రగ్స్ తీసుకోవడం వలన తాత్కాలిక ఆనందం కలిగినా&&num;8230&semi; పర్మినెంట్ గా జీవితాలు డామేజ్ అవుతాయని విద్యార్థులకు తెలిసేలా చేస్తున్నట్లు తెలిపారు&period; డ్రగ్స్ ఫ్రీ తెలంగాణకు అందరూ కృషి చేయాలని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సినిమా చూస్తున్నప్పుడు మాకు చరణ్ కనిపించలేదు ‘పెద్ది’ మాత్రమే కనిపించాడు.

అనకాపల్లి తీరంలో వేలాది చేపల మృతి.

ఉత్కంఠభరిత పోరులో శ్రీలంక Aపై భారత్ A అద్భుత విజయం.