షరతులతో బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు.

Advertisements

<p>మాజీ మావోయిస్టు నేత&comma; తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యకు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది&period; ఎన్ఐఏ నమోదు చేసిన కేసులో చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు రూ&period;25 వేల అదనపు పూచీకత్తుతో రెండు షూరిటీ బాండ్లు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది&period; అలాగే బెయిల్ కాలంలో ప్రతి శుక్రవారం కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో విచారణాధికారి ఎదుట తప్పనిసరిగా హాజరుకావాలని షరతు విధించింది&period;<&sol;p>&NewLine;<p>మావోయిస్టు భావజాలాన్ని ప్రచారం చేశారనే ఆరోపణలతో ఎన్ఐఏ గాదె ఇన్నయ్యపై యూఏపీఏ చట్టం కింద కేసు నమోదు చేసి గత ఏడాది డిసెంబర్ 21à°¨ అరెస్టు చేసింది&period; ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు నేత వికల్ప్ అంత్యక్రియల సందర్భంగా చేసిన ప్రసంగం మావోయిస్టు భావజాలాన్ని ప్రోత్సహించేలా ఉందని ఎన్ఐఏ అభియోగాలు మోపింది&period; ఈ కేసులో తాజాగా హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ములుగులో సీఎం పర్యటన ఏర్పాట్లపై మంత్రి సీతక్క సమీక్ష.

కరీంనగర్ లో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ వారోత్సవాలు.

సినిమా చూస్తున్నప్పుడు మాకు చరణ్ కనిపించలేదు ‘పెద్ది’ మాత్రమే కనిపించాడు.