నేడు ప్రముఖ నిర్మాత, సినీ పాత్రికేయుడు బి ఏ రాజు 64వ జయంతి…

B.A. Raju

Advertisements

&NewLine;<p>సూపర్ స్టార్ కృష్ణ వద్ద పబ్లిసిటీ వ్యవహారాలను చూసే పి ఆర్ ఓ గా సినీ కేరీర్ ని ఆరంభించిన బి&period;ఏ&period;రాజు ఆ తరువాత ఆయన ప్రోత్సహంతోనే సినీ పాత్రికేయుడిగా రాణించారు&period; ఆంధ్రజ్యోతి&comma; జ్యోతి చిత్ర&comma; ఉదయం&comma; శివరంజని&comma; వంటి దిన వార పత్రికలలో వివిధ హోదాలలో పనిచేసిన పిమ్మట తన సతీమణి బి జయ సహచర్యంతో 1994 లో సూపర్ హిట్ వార పత్రిక స్థాపించి&comma; తెలుగు సినీ వార్తాపత్రికలలో సంచలనం సృష్టించారు&period; ఆయన మరణం వరకు ఒక్క సంచిక మిస్సవకుండా 27 సంవత్సరాలపాటు పత్రికను దిగ్విజయంగా నిర్వహించారు&period; కేవలం సినీ జర్నలిస్టుగానే కాకుండా అగ్ర దర్శకులకు&comma; హీరోలకు&comma; హీరోయిన్లకు గైడ్ లైన్స్ ఇస్తూ వారి సినీ కెరీర్ కి మార్గదర్శకుడిగా నిలిచారు&period; సుమారు 1500 చిత్రాలకు పైగా పబ్లిసిటీ ఇంఛార్జిగా పని చేసిన బి&period;ఏ&period;రాజు ఆయా చిత్రాల విజయాలకు దోహదపడ్డారు&period; చిత్ర పరిశ్రమలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరితో ఆత్మీయ అనుబంధాన్ని ఏర్పర్చుకున్న అజాత శత్రువు బి&period;ఏ&period;రాజు&period; తెలుగు సినీ రంగం హైదరాబాద్ బదిలీ కావడంతో 2001 లో సూపర్ హిట్ అడ్మిస్ట్రేషన్ ఆఫీస్ కూడా హైదరాబాద్ కు షిఫ్ట్ చేసారు&period; ఈ ఏడాదే అయన నిర్మాతగా&comma; ఆయన భార్య బి జయ దర్శకురాలిగా &&num;8216&semi;ప్రేమలో పావని కళ్యాణ్&&num;8217&semi; అనే చిత్రంతో ఆర్ జే సినిమాస్ బ్యానర్ మీద నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు&period; చంటిగాడు&comma; ప్రేమికులు&comma; గుండమ్మ గారి మనవడు&comma; సవాల్&comma; లవ్లీ&comma; వైశాఖం వంటి విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు&period; రాజు గారు ప్రారంభించిన ఇండస్ట్రీ హిట్ వెబ్ సైట్ ద్వారా&comma; దాదాపు 7 లక్షల మంది ఫాలోవర్స్ కలిగిన ఎంతో పాపులర్ అయిన ఆయన &lpar;ట్విట్టర్&rpar; ఎక్స్ అకౌంట్ ద్వారా పరిశ్రమకు సంబంధించిన వార్తా విశేషాలు ఎప్పటికప్పుడు ఆయన బృందం&comma; BA Raju&&num;8217&semi;s Team ద్వారా అందిస్తున్నారు&period; ఆర్ జే సినిమాస్ ద్వారా కూడా ఆయన తనయుడు శివకుమార్ బి నిర్మాతగా త్వరలో ప్రముఖ హీరోలతో చిత్రాలను ప్రకటించనున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>చిత్ర పరిశ్రమ ప్రముఖులందరితో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ… ముఖ్యంగా ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ కృష్ణ&comma; సూపర్ స్టార్ మహేష్ బాబు లతో మంచి అనుబంధం ఉండేది&period; ఆయన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా పనిచేసారు&period; సినీ పాత్రికేయులకు ఏ కష్టం వచ్చినా నేనున్నాని&comma; ఆర్ధిక భరోసా ఇచ్చేవారు&period; ఏ దర్శకుడు ఏ హీరోతో ఎన్ని సినిమాలు నిర్మించాడో&quest; బ్యానర్ పేరు&comma; విడుదల తేదీ ఆ మూవీ ఎన్ని రోజులు ఏ సెంటర్లలో ఆడిందో వంటి వివరాలను తడుముకోకుండా టక్కున చెప్పేవారు&period; అంతటి సినిమా పరిజ్ఞానాన్ని సొంతం చేసుకున్నారు&period; 24 గంటలు సినిమా గురించే ఆలోచించే బి&period;ఏ&period;రాజు మన మధ్యన లేకపోవడం బాధాకరం&period; ఏ లోకాన వున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని 64à°µ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఘనంగా జరిగిన ‘కళాంకి భైరవుడు’ టీజర్ లాంచ్.

‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి. వి. వినాయక్.