పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లో కార్తీకమాసం సందడి మొదలైంది. కార్తీక మాసంలోని మొట్టమొదటి రోజు కావడంతో నరసాపురం వశిష్ట గోదావరి వలందర్ రేవులో ఉదయం తెల్లవారుజాము నుండి వేలాది మంది భక్తులు పుణ్య స్థానాలు ఆచరించి గోదావరి నదిలో కార్తీకదీపాలను వదిలి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి సమీపంలోని శివాలయాలు శివనామ స్మరణతో మార్మోగాయి. శివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీకమాసంలో శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ద్వారా పుణ్యఫలం పొందుకుంటామని భక్తుల ప్రగాఢ విశ్వాసం దీంతో నరసాపురం పట్టణంలోని అమరేశ్వర స్వామి దేవాలయంలో ఉదయం తెల్లవారుజాము నుండి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. భక్తుల రాకతో నరసాపురం వశిష్ట గోదావరి తీరం జన సందోహంగా మారింది. ప్రతి ఏట కార్తీకమాసం సందర్భంగా ఈ వలందర్ రేవులో నిత్యం వేలాది మంది భక్తులు కార్తీకదీపాలను వదిలి పుణ్య స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. వశిష్ట ముని తపస్సు చేసిన ఈ ప్రాంతంలో కార్తీక మాసంలో పూజలు నిర్వహించడం ద్వారా ఆ పరమశివుడి అనుగ్రహం పొందుకుంటామని భక్తుల నమ్మకం భక్తజన సందోహంతో శివనామ స్మరణ మార్మోగింది.
అధికారుల నిర్లక్ష్యం .. మురికి కాలువల మారిన గోదావరి
61