140
శ్రీ సత్య సాయి జిల్లా ఓబుల దేవర చెరువు మండల కేంద్రంలో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన వెలుగు చూసింది. స్థానిక బీసీ కాలనీలో నివాసముంటున్న మెహ్రూన్ బి 8 సంవత్సరాల క్రితం భర్తతో విభేదాలు రావడంతో ఒంటరిగా నివాసముంటూ కూలి పనులు చేస్తూ జీవనం సాగించేది. ఈ క్రమంలో ఇంటి స్టోర్ రూమ్ ఆవరణలో అచేతనంగా పడి ఉన్న మహిళను చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. భార్యకు దూరంగా ఉంటున్న భర్త వలి ఉపాధి పని నిమిత్తం బెంగళూరులో ఉంటున్నాడు. ఆమె మృతికి గల కారణాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.