అన్నమయ్య జిల్లాలో విషాదం…

Advertisements

<p>అన్నమయ్య జిల్లా పుంగనూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది&period; బైక్‌ నుంచి వచ్చే పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు&period; పుంగనూరు త్యాగరాజు వీధిలో ఈ ఘటన జరిగింది&period; మృతిచెందిన వారిని తాత&comma; మనవడు&comma; ఇద్దరు మనవరాళ్లుగా గుర్తించారు&period; త్యాగరాజు వీధికి చెందిన మురళి&comma; రేవతి భార్యాభర్తలు&period; ఆయనకు తండ్రి రామచంద్రయ్య&comma; కుమారుడు కార్తీక్‌&comma; కవల కుమార్తెలు చరిత&comma; చందన ఉన్నారు&period; తన బైక్‌కు మరమ్మతులు చేయించిన మురళి&period;&period;మెకానిక్‌ చెప్పినట్టు ఇంజిన్‌ను రాత్రంతా ఆన్‌లోనే ఉంచాడు&period; ఆ గది ఇరుగ్గా ఉండటం&period;&period;గాలి బయటకు వెళ్లే వీలు లేకపోవడంతో&period;&period;రాత్రి నుంచి బైక్‌ నుంచి వచ్చిన పొగ అంతా గదిలో వ్యాపించింది&period; దీంతో తాత&comma; మనవడు&comma; మనవరాళ్లు ఆ పొగ పీల్చి మృతిచెందారు&period; ఇంటి పైన గదిలో నిద్రించడంతో మురళి&comma; రేవతి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు&period; పిల్లల మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.