125
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు సీఐడీ చీఫ్ సంజయ్‌పై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫిర్యాదు చేశారు. సర్వీస్ రూల్స్ అతిక్రమించి మరీ ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి తొత్తులా పని చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైసీపీకి వత్తాసు పలుకుతున్న సీఐడీ చీఫ్ సంజయ్ పైన చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్ మెప్పు కోసం ప్రతిపక్షాలపై బురద జల్లుతున్నారని పేర్కొన్నారు. సీఐడీ చీఫ్ రాజకీయ పక్షపాతాలు లేకుండా పని చేయాలని, కానీ ఆయన అలా ఉండటం లేదన్నారు. ఎఫ్ఐఆర్లో పేరు లేకుండానే, విచారణ చేయకుండానే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేశారన్నారు.