అమెరికాలో భారీ హిమపాతం..

Advertisements

<p>అమెరికాలో భారీ స్థాయిలో మంచు కురుస్తోంది&period; దీనికి తోడు బలమైన గాలులు వణికిస్తున్నాయి&period; న్యూయార్క్‌ సహా ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది&period; న్యూయార్క్‌ నుంచి మసాచుసెట్స్‌ వరకు భారీ మంచు తుపాను విరుచుకుపడింది&period; దీంతో రోడ్లు&comma; ఇళ్లు&comma; దుకాణాలు&comma; పార్క్‌లు&comma; మైదానాలు ఇలా ఎక్కడ చూసినా మంచు పేరుకుపోయింది&period; మంచు తుపాను ధాటికి వాహనాల్లో ప్రయాణాలపై అధికారులు నిషేధం విధించారు&period; 5వేలకు పైగా విమానాలు రద్దయ్యాయి&period; ముఖ్యంగా న్యూయార్క్&comma; న్యూజెర్సీ&comma; బోస్టన్‌ పరిధిలో విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది&period; ఈ స్థాయిలో న్యూయార్క్‌ నగరాన్ని మంచు తుపాను చుట్టుముట్టడం గత తొమ్మిదేళ్లలో ఇదే తొలిసారి&period; ఇక న్యూజెర్సీలో 1996 తర్వాత ఇంతటి స్థాయిలో మంచు కురవడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు స్థానికులు&period; న్యూయార్క్‌లోని లాంగ్‌ ఐలాండ్‌ మాక్‌ ఆర్థర్‌ ఎయిర్‌పోర్టులో 22&period;5 అంగుళాల దట్టమైన మంచు కురిసినట్టు వెల్లడించారు అధికారులు&period; గంటకు 48 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి&period; మంచు తుపాను హెచ్చరికల నేపథ్యంలో లక్షలాది మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు&period; విద్యుత్‌ సరఫరాలో అంతరాయంతో లక్షలాది మంది అంధకారంలో చిక్కుకున్నారు&period; న్యూయార్క్ సిటీ&comma; ఫిలడెల్ఫియాతో పాటు డెలావేర్ నుంచి మసాచుసెట్స్ వరకు పలు రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..

భారత్‌లో వ్యక్తిగత పర్యటనలో టిఫానీ ట్రంప్‌..

భారత మామిడిపండ్లపై జపాన్ తాత్కాలిక నిషేధం విధించడం కలకలం రేపింది.