విజయ్‌ నేతృత్వంలో ‘సామాజిక న్యాయ విజయ కూటమి’.

Advertisements

<p>తమిళనాడు రాజకీయాల్లో విజయ్‌ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం మరో కీలక రాజకీయ అడుగు వేసింది&period; టీవీకే ఆధ్వర్యంలో ఏర్పడిన కొత్త కూటమికి సామాజిక న్యాయ విజయ కూటమి గా పేరు ఖరారైంది&period; విజయ్‌ అధ్యక్షతన చెన్నై పనయూర్‌లో జరిగిన సమన్వయ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు&period; ఈ కూటమిలో టీవీకేతో పాటు కాంగ్రెస్‌&comma; వీసీకే&comma; ఎండీఎంకే&comma; ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ కీలక భాగస్వాములుగా ఉన్నాయి&period; కాంగ్రెస్‌ నుంచి మాణిక్కం ఠాగూర్‌&comma; వీసీకే అధినేత తిరుమావళవన్‌&comma; ఎండీఎంకే నేత వైకో&comma; ఐయూఎంఎల్‌ నేత ఖాదర్‌ మొహిద్దీన్‌ సమావేశానికి హాజరయ్యారు&period;<&sol;p>&NewLine;<p>&lpar;&rpar;ఈ కూటమి కేవలం ఎన్నికల పొత్తుగా కాకుండా&period;&period; మత సామరస్యం&comma; సామాజిక న్యాయం&comma; సమానత్వం&comma; అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణ వంటి అంశాలను ప్రధాన ఎజెండాగా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తోంది&period; ముఖ్యంగా కాంగ్రెస్‌&comma; వీసీకే వంటి పార్టీలతో విజయ్‌ టీవీకే కలిసి రావడం ద్వారా విస్తృత సామాజిక వర్గాలను కలుపుకునే ప్రయత్నం కనిపిస్తోంది&period; మరోవైపు సీపీఐ&comma; సీపీఎం ఈ సమావేశానికి హాజరుకాకపోవడం కూటమి విస్తరణపై ఆసక్తికర పరిణామంగా మారింది&period;<&sol;p>&NewLine;<p>&lpar;&rpar;విజయ్‌ నేతృత్వంలోని ఈ కూటమి భవిష్యత్‌ రాజకీయాల్లో డీఎంకే&comma; అన్నాడీఎంకేకు ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా ఎదగాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి&period; అధికారికంగా కూటమి పేరు ఖరారైన నేపథ్యంలో&period;&period; భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయం&comma; ఉమ్మడి కార్యక్రమం&comma; భవిష్యత్‌ ఎన్నికల వ్యూహం ఇప్పుడు కీలకంగా మారనున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.

ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.