ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ మొజ్తాబా ఖమేనీ..

Advertisements

<p>ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తాబా ఖమేనీ ఎన్నికైనట్టు తెలిపాయి అక్కడి వార్తాసంస్థలు&period; అయితే&comma; ఇది నిజం కాదని ఇరాన్‌ ప్రభుత్వం ప్రకటించింది&period; అమెరికా&comma; ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇటీవల ప్రాణాలు కోల్పోయిన సుప్రీం లీడర్‌ ఖమేనీ రెండవ కుమారుడే మొజ్తాబా&period; ఆయన వయస్సు 56 ఏళ్లు&period; నిపుణుల అసెంబ్లీ నిన్న సమావేశమై&period;&period; కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తాబాను ఎన్నుకున్నట్లుగా ప్రచారం జరిగింది&period; దేశంలోని శక్తిమంతమైన &OpenCurlyQuote;ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌’ IRGC మద్దతు మొజ్తాబాకు ఉందని&comma; ఈ నేపథ్యంలోనే ఆయనకు అత్యున్నత బాధ్యతలు అప్పగించినట్లు తెలిపాయి&period; అయితే&comma; దీనిపై ఇరాన్‌ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది&period; నిపుణుల అసెంబ్లీ ఒక నాయకుడిని ఎన్నుకుందన్న వార్తల్లో వాస్తవం లేదని తెలిపింది&period;<&sol;p>&NewLine;<p>ఇదిలా ఉంటే&period;&period;ఇరాన్‌ కొత్త నేతగా ఎవరిని ఎన్నుకున్నా వారిని అంతమొందిస్తామని వెల్లడించారు ఇజ్రాయెల్‌ రక్షణమంత్రి కట్జ్‌&period; మొజ్తాబాను ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నుకున్నారన్న వార్తల నేపథ్యంలో ఎక్స్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు&period; &OpenCurlyQuote;ఇజ్రాయెల్‌ వినాశనానికి ప్రణాళికలు అమలుపరిచేందుకు&comma; అమెరికాను&comma; స్వేచ్ఛాయుత ప్రపంచాన్ని&comma; పశ్చిమాసియాలోని ఇతర దేశాలను బెదిరించేందుకు&comma; ఇరాన్‌ ప్రజల్ని అణచివేసేందుకు ఇరాన్‌ ఉగ్రరాజ్యం ఏ నాయకుడిని నియమించినా అంతమొందిస్తామని తెలిపారు&period; ఆ నాయకుడు ఎవరైనా&comma; ఎక్కడా దాక్కున్నా సరే వదిలేదిలేదని&period;&period;ఈ మేరకు సైన్యానికి ఆదేశాలిచ్చినట్టు వెల్లడించారు కట్జ్‌&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.