ఇరాన్ సుప్రీం లీడర్ మరణం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాశం..

Advertisements

<p>ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ మరణం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాశంగా మారింది&period; శక్తివంతమైన ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్&lpar;ఐఆర్&ZeroWidthSpace;జీసీ&rpar; అని పిలవబడే రక్షణ దళం భద్రతా నిఘాలో ఉండే ఖమేనీ హత్య చేయడం అంతా ఈజీ పని కాదు&period; కానీ తాజాగా ఇజ్రాయెల్&comma;అమెరికా సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఖమేనీ మరణించాడు&period; అయితే ఖమేనీ మృతి వెనుక ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ చేపట్టిన సీక్రెట్ ఆపరేషన్ ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తోంది&period; తమ దేశ ప్రభుత్వం ఖమేనీని ఎలిమినేట్ చేయాలని పెట్టుకున్న లక్ష్యం కోసం ఎవరూ ఊహించని రీతిలో అతడి కదలికలను పసిగట్టి దేశానికి చేరవేసింది&period; మొస్సాద్ ఇచ్చిన అత్యంత కచ్చితమైన సమాచారంతో రంగంలోకి దిగిన ఇజ్రాయెల్&comma; అమెరికా దళాలు అంతే కచ్చితత్వంతో ఖమేనీపై ఎటాక్ చేసి చంపేశాయి&period; ప్రపంచంలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా ఇజ్రాయెల్‌ మొస్సాద్‌ ఇట్టే పసిగడుతుందనే పేరుంది&period; ఖమేనీని అంతం చేయడంతో ప్రపంచంలో మరోసారి మొస్సాద్ పేరుపై జోరుగా చర్చ జరుగుతోంది&period; శత్రువు టార్గెట్ ఫిక్స్ అయితే వారిని స్మాష్ చేసేందుకు మొస్సాద్ ఎలాంటి ఎత్తుగడలు వేస్తుందో ఓ సారి చూద్దాం&period;&period;<&sol;p>&NewLine;<p>ఇరాన్ సుప్రీం నేతను ఎలాగైనా అంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఇజ్రాయెల్‍కు ఇదంత తేలికగా సాధ్యం కాలేదు&period; ఇందుకోసం అనేక ఏళ్లు అనేక రకాలుగా మొస్సాద్ నిఘా కొనసాగించింది&period; చివరకు ట్రాఫిక్ కెమెరాల నెట్ వర్క్&comma; మొబైల్ ఫోన్ సిస్టమ్స్ హ్యాక్ చేసి ఖమేనీ ప్రతి కదలికను ట్రాక్ చేసిందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి&period; ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో కొన్ని ఏళ్ల పాటు ట్రాఫిక్ కెమెరాల హ్యాకింగ్ కు పాల్పడిన మొస్సాద్ వాటి ఫుటేజ్ ను ఎన్ క్రిప్ట్ చేసి స్వదేశానికి పంపించింది&period; ఖమేనీ కార్యాలయంలో రోజువారీ కార్యకలాపాలు&comma; ఆయన భద్రతా సిబ్బంది వాహనాల పార్కింగ్&quest; ఖమేనీ ఎక్కడ ఉంటారు&quest; ఆయన ఎవరెవరిని కలుస్తున్నారు&quest; ఎవరితో ఎలా కమ్యూనికేట్ అవుతారు&quest; ఏదైనా ఆపద సమయం వస్తే ఎక్కడికి వెళ్తారు అనే వివరాలన్ని క్షుణ్ణంగా పసిగట్టింది&period; ఆ సమచారం అంతా ఎప్పటికప్పుడు తమ దేశానికి చేరవేసింది&period; ఈ క్రమంలో ఏఐ టూల్స్&comma; అర్గరిథమ్స్ ను కూడా ఉపయోగించిందని&comma; ఇలా సేకరించిన పూర్తి సమాచారంతో ఫిబ్రవరి 28à°¨ ఎటాక్ చేసి చంపేసినట్లు ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది&period;<&sol;p>&NewLine;<p>మొస్సాద్ తాను పెట్టుకున్న టార్గెట్‍ను పూర్తి చేసేందుకు ఎంత కసిగా ఉంటుందో అంతే ఓర్పుతో ఎగ్జిక్యూట్ చేస్తుందనడానికి ఈ సంస్థ 1978లో చేపట్టిన ఆపరేషన్ స్యాడ్ నెస్ బెస్ట్ ఎగ్జామ్ పుల్&period; 1976 లో ప్రత్యేక పాలస్తీనా కోసం పోరాడుతున్న పాపులర్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా సంస్థ చీఫ్ హద్దాద్ నేతృత్వంలో ఎయిర్ ఫ్రాన్స్ హైజాక్ చేశారు&period; హైజాకర్లు విమానాన్ని టెల్‌ అవీవ్‌ నుంచి పారిస్‌కు ఆ తర్వాత లిబియా&comma; ఉగాండాకు తరలించుకుపోయారు&period; ఇజ్రాయెల్‌ దీన్ని &OpenCurlyQuote;ఆపరేషన్‌ థండర్‌బోల్ట్‌’తో తిప్పికొట్టింది&period; ఈ ఆపరేషన్ విజయవంతం అయినా ఈ మిషన్‌కు నేతృత్వం వహించిన లెఫ్టినెంట్‌ కర్నల్‌ యొనాతన్‌ నెతన్యాహు మృతి చెందారు&period; ఈయన ప్రస్తుత ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుకు స్వయాన సోదరుడు&period; యొనాతన్ మృతికి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్న మొస్సాద్ హద్దాద్‍ను టార్గెట్ గా పెట్టుకుంది&period; ఈ ఆపరేషన్ కు &&num;8216&semi;ఏజెంట్ స్యాడ్ నెస్&&num;8217&semi; అని నామకరణం చేసింది&period; హద్దాద్ ఇల్లు&comma; కార్యాలయంలోకి వెళ్లగలిగే ఓ వ్యక్తిని తమ ఉచ్చులోకి లాకుంది&period; అలా 1978 జనవరి 10à°¨ ఈ ఆపరేషన్ ద్వారా తన టార్గెట్ ను పూర్తి చేసింది&period; అయితే తమ ట్రాప్‍లోకి తీసుకున్న హద్దాద్ ఇంట్లోకి వెళ్లగలిగే వ్యక్తి చేత హద్దాద్ రోజూ ఇంట్లో వాడే టూత్ పేస్ట్ స్థానంలో ఇజ్రాయెల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ బయోలాజికల్‌ రీసెర్చ్‌లో తయారు చేసిన స్పెషల్ టూత్ పేస్ట్ ను ఉంచేలా చేయగలిగింది&period; అంతే కాదు ఆ పేస్ట్ ను హద్దాద్ ఉపయోగించేలా ప్లాన్ చేశారు&period; విషపూరిత రసాయనాలతో చేసిన ఆ పేస్ట్ వినియోగించిన హద్దాద్ కొన్ని రోజుల్లోనే తీవ్ర అనారోగ్యానికి గురై చనిపోయారు&period;<&sol;p>&NewLine;<p>2024లో లెబనాన్‍లోని హెజ్ బొల్ల మిలిటెంట్ సంస్థకు చెందిన వందలాది మంది తమ వద్ద ఉన్న పేజర్లు పేలి మృతి చెందారు&period; అనేక మంది గాయపడ్డారు&period; ఈ పేలుళ్ల వెనుక కూడా మొస్సాద్ ఉన్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి&period; పేజర్ అంటే రేడియో తరంగాల ద్వారా సంక్షిప్త సందేశాలను పంపే చిన్న&comma; పోర్టబుల్ కమ్యూనికేషన్ పరికరం&period; సెల్ ఫోన్లు ప్రాచుర్యంలోకి రాకముందు ప్రపంచవ్యాప్తంగా పేజర్లను విస్తృతంగా వినియోగించేవారు&period;<&sol;p>&NewLine;<p>మొస్సాద్ ఇప్పటివరకు హతమార్చిన మరికొంత మంది వివరాలు చూద్దాం&period; 2024లో హమాస్‌ సీనియర్‌ కమాండర్‌ ఆమన్‌ షొవదేపై గగనతల దాడి చేసి హతం చేసింది మొస్సాద్&period; ఆదే సంవత్సరం ఇజ్రాయెల్‌ పౌరులు&comma; యూదులను లక్ష్యంగా చేసుకుని అంతర్జాతీయంగా ఉగ్రవాద కార్యకలాపాలు చేపడుతున్నారనే ఆరోపణలపై హదీ ముస్తఫా అనే వ్యక్తిని డ్రోన్‌ దాడితో హతమార్చింది&period;<br &sol;>&NewLine;2018లో హమాస్‌ ఆయుధ నిపుణుడు ఫదీ ముహమ్మద్‌ అల్‌ బాత్ష్‌ ఓ మసీదుకు వెళ్లేందుకు కౌలాలంపూర్‌లో ప్రయాణిస్తుండగా మోటారు సైక్లిస్టులుగా వచ్చినవారు కాల్పులు జరిపి హతమార్చారు&period;<br &sol;>&NewLine;2009లో హమాస్‌ రాజకీయ నేతల్లో కరడుగట్టినవాదిగా పేరొందిన మతపెద్ద నిజార్‌ రయ్యన్‌పై జరిపిన దాడిలో ఆయనతో పాటు ఇద్దరు భార్యలు&comma; ఏడుగురు పిల్లలు హతమయ్యారు&period; 2004లో గాజా నగరంపై మాస్టర్‌ బాంబర్‌తో గగనతల దాడి జరిపి సైన్యంలో నంబరు-2గా ఉన్న అద్నాన్‌ అల్‌ ఘౌల్‌ ను హతం చేసింది మొస్సాద్&period; 2004లో కారుపై క్షిపణితో దాడిచేసి హమాస్‌ నేత అబ్దెల్‌ అజీజ్‌ అల్‌ రంటిస్సిని హత్య చేసింది&period; 2004లో హమాస్‌ ఆధ్యాత్మిక నేత అహ్మద్‌ యాసిన్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌పై క్షిపణి దాడికి పాల్పడింది&period;<&sol;p>&NewLine;<p>గురి తప్పకుండా లక్ష్యాలను ఛేదించడంలో నిష్ణాతులు ఉన్న మొస్సాద్ చరిత్రలో జరిగిన కొన్ని ప్రధాన వైఫల్యాలు కూడా ఉన్నాయి&period;<br &sol;>&NewLine;1951లో బాగ్దాద్ స్పై రింగ్ &colon; ఇది మొస్సాద్ ప్రారంభ దశలో జరిగిన అతిపెద్ద వైఫల్యం&period; ఇరాక్‌లో ఇజ్రాయెల్ గూఢచారుల బృందం పట్టుబడటంతో&comma; ఆ బృందానికి చెందిన పలువురు అధికారులు అరెస్టు అయ్యారు&period; ఇది ఇజ్రాయెల్‌కు తీవ్రమైన ఇబ్బందిని కలిగించింది&period; 1954లో ఆపరేషన్ సుసన్నా &colon; ఈజిప్టులో పశ్చిమ దేశాల ఆస్తులపై బాంబు దాడులు చేసి&comma; ఆ నిందను స్థానిక ఉగ్రవాదులపైకి నెట్టేందుకు చేసిన &&num;8220&semi;ఫాల్స్ ఫ్లాగ్&&num;8221&semi; కుట్ర ఇది&period; అయితే&comma; ఒక బాంబు అనుకోకుండా ముందే పేలడంతో ఈ మొత్తం కుట్ర బయటపడింది&period; దీనివల్ల గూఢచారి బృందం అరెస్టు కావడమే కాకుండా&comma; ఇజ్రాయెల్ రక్షణ మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది&period;<&sol;p>&NewLine;<p>1973లో లిల్లీహామెర్ ఎఫైర్ &colon; 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్ ఊచకోతకు ప్రతీకారంగా మొస్సాద్ చేపట్టిన &&num;8216&semi;ఆపరేషన్ రాత్ ఆఫ్ గాడ్&&num;8217&semi;లో భాగంగా ఇది జరిగింది&period; నార్వేలో మొస్సాద్ ఏజెంట్లు తప్పుడు సమాచారంతో ఒక అమాయకపు మొరాకో వెయిటర్‌ను పొరపాటున హతమార్చారు&period; దీనివల్ల నార్వేలో ఆరుగురు ఏజెంట్లు పట్టుబడి జైలు శిక్ష అనుభవించారు&period;<br &sol;>&NewLine;1997లో ఖలీద్ మెషాల్ హత్యాయత్నం &colon; జోర్డాన్‌లో హమాస్ నాయకుడు ఖలీద్ మెషాల్‌ను విషం ఇచ్చి చంపడానికి ప్రయత్నించిన మొస్సాద్ ఏజెంట్లు అక్కడే పట్టుబడ్డారు&period; దీనివల్ల ఇజ్రాయెల్ తీవ్ర దౌత్యపరమైన సంక్షోభాన్ని ఎదుర్కొంది&period; చివరకు తమ ఏజెంట్లను విడిపించుకోవడానికి ఇజ్రాయెల్ ఆ విషానికి విరుగుడును అందించాల్సి వచ్చింది&comma; అంతేకాకుండా హమాస్ వ్యవస్థాపకుడు షేక్ అహ్మద్ యాసిన్‌ను జైలు నుంచి విడుదల చేయాల్సి వచ్చింది&period; 2004లో న్యూజిలాండ్ పాస్‌పోర్ట్ స్కాండల్ &colon; న్యూజిలాండ్ పాస్‌పోర్టులను అక్రమంగా పొందడానికి ప్రయత్నించిన ఇద్దరు అనుమానిత మొస్సాద్ ఏజెంట్లు పట్టుబడ్డారు&period; ఇది ఇజ్రాయెల్&comma; న్యూజిలాండ్ మధ్య ఏడాది పాటు దౌత్యపరమైన సంబంధాలను దెబ్బతీసింది&period; దీనిపై ఇజ్రాయెల్ ప్రభుత్వం అధికారికంగా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..

భారత్‌లో వ్యక్తిగత పర్యటనలో టిఫానీ ట్రంప్‌..

భారత మామిడిపండ్లపై జపాన్ తాత్కాలిక నిషేధం విధించడం కలకలం రేపింది.