ఛార్‍థామ్ యాత్రలో తీవ్ర ట్రాఫిక్ జామ్ …

ఛార్‍థామ్ యాత్రలో తీవ్ర ట్రాఫిక్ జామ్

Advertisements

<p>ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి&period; చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా బద్రీనాథ్‌ వెళుతున్న భక్తులు భారీ ట్రాఫిక్‌జామ్‌ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు&period; వారాంతపు సెలవులు&comma; యాత్రికుల రద్దీ భారీగా పెరగడంతో కేదార్‌నాథ్ &comma; జోషిమఠ్&comma; గోవింద్‌ ఘాట్స్‌ సమీపంలోని బద్రీనాథ్ మార్గం అలాగే కేదార్‌నాథ్‌కు దారితీసే సోన్‌ ప్రయాగ్ వంటి కీలక మార్గాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది&period; ముఖ్యంగా జోషిమఠ్ నుండి బద్రీనాథ్ వరకు 25 నుండి 30 కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడంతో యాత్రికులు గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది&period; సరైన ఆహారం&comma; నీళ్లు లేక యాత్రికులు ఇబ్బంది పడుతున్నారు&period; పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు&comma; పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడుతున్నారు&period;<br &sol;>&NewLine;యాత్రకు వెళ్లే భక్తులు ముందుగానే వాతావరణ పరిస్థితులు&comma; ట్రాఫిక్ వివరాలను తెలుసుకొని అంతుకు అనుగుణంగా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు&period; కాగా&comma; యాత్రికులకు మార్గమధ్యంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు&comma; యాత్రా మార్గం పొడవునా ట్రాఫిక్ నిర్వహణను పటిష్టం చేయాలని భక్తులు కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వెంకటగిరిలోని విశ్వోదయ కళాశాల భూమిపై కబ్జా కోరుల కన్ను !

ఈత సరదా అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి..

తెలంగాణ లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే -మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు.