ఉత్తర అమెరికా దేశం మెక్సికోలో తీవ్రస్థాయి హింస చెలరేగింది.

ఉత్తర అమెరికా దేశం మెక్సికోలో తీవ్రస్థాయి హింస చెలరేగింది.

Advertisements

<p>ఉత్తర అమెరికా దేశం మెక్సికోలో తీవ్రస్థాయి హింస చెలరేగింది&period; డ్రగ్స్‌ ముఠా నాయకుడు ఎల్‌ మెంచో సైన్యం కాల్పుల్లో మరణించాడు&period; దీంతో మాఫియా డాన్ అనుచరులు రెచ్చిపోయి ప్రతీకార దాడులకు దిగటంతో హింస చెలరేగింది&period; మెక్సికోలోని పలు రాష్ట్రాల్లో అతడి అనుచరులు దాడులకు దిగారు&period; 25 మంది నేషనల్‌ గార్డ్‌ సభ్యులను హత్య చేశారు&period; 59 ఏళ్ల ఎల్‌ మెంచో హతమయ్యాక పలు రాష్ట్రాల్లో అతడి అనుచరులు వాహనాలను తగలబెట్టారు&period; రహదారుల్ని దిగ్బంధించారు&period; సూపర్‌ మార్కెట్లు&comma; పెట్రోల్‌ బంకులు&comma; బ్యాంకులకు నిప్పంటించారు&period; వారు జరిపిన ఆరు వేర్వేరు దాడుల్లో 25 మంది నేషనల్‌ గార్డ్‌ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు&period; ఈ పరిణామాలతో చాలా రాష్ట్రాల్లో పాఠశాలలను మూసివేశారు&period; అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దంటూ భారత్‌ సహా పలు దేశాలు మెక్సికోలోని తమ పౌరులకు అడ్వైజరీ జారీ చేశాయి&period; తాజా హింసలో కొందరు సాధారణ పౌరులూ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది&period; ఎల్‌ మెంచో కరడుగట్టిన నేరగాడు&period; మెక్సికోలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న క్రిమినల్‌ సంస్థ &OpenCurlyQuote;న్యూ జనరేషన్‌ కార్టెల్‌’కు అతడే బాస్‌&period; అమెరికాకు ఫెంటానిల్&comma; మెథాఫెటమైన్&comma; కొకైన్‌లను అక్రమంగా రవాణా చేయిస్తుంటాడు&period; ఎల్‌ మెంచోను అదుపులోకి తీసుకునే సమాచారమిచ్చేవారికి దాదాపు రూ&period;136 కోట్ల రివార్డు అందజేస్తామంటూ గతంలో వాషింగ్టన్‌ ప్రకటించింది&period; అతడి కుమారుడు అమెరికాలో డ్రగ్స్‌ అక్రమ రవాణా కేసులో జీవితఖైదు అనుభవిస్తున్నాడు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..

భారత్‌లో వ్యక్తిగత పర్యటనలో టిఫానీ ట్రంప్‌..

భారత మామిడిపండ్లపై జపాన్ తాత్కాలిక నిషేధం విధించడం కలకలం రేపింది.