ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో డ్వాక్రా సంఘాల గ్రూప్ సభ్యులు స్టేట్ బ్యాంకు ఎదుట ఆందోళనకు దిగిన సంఘటన గురువారం చోటుచేసుకుంది.పొదుపు సంఘాల మహిళలకు 40లక్షల రూపాయల ఋణం మంజూరైనా,గ్రూప్ అకౌంట్లో జమ చెయ్యని బ్యాంకు అధికారుల తీరుతో మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.డ్వాక్రా గ్రూపులు డబ్బుల కోసం అనేకసార్లు బ్యాంకు చుట్టూ తిప్పుకుని,ఇవ్వని సొమ్ముకు ముందు వడ్డీ కట్టాలని బ్యాంకు మేనేజర్ తెలుపడంతో అవాక్కయైన మహిళలు ఆందోళన బాట పట్టారు. బ్యాంక్ అధికారుల నిర్లక్ష్య సమాధానం కు విసుగు చెంది అన్యాయం ను ప్రశ్నిస్తూ స్టేట్ బ్యాంక్ ముందు ఆందోళనకు దిగిన డ్వాక్రా గ్రూప్ లకు చెందిన స్వయం సహాయక సంఘాల సభ్యులు. ఎస్బిఐ మేనేజర్ తీరుతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు తెలియజేస్తున్నారు. బ్యాంకు ఖాతాల సక్రమ నిర్వహణ కొనసాగకపోతే, బ్యాంకు బయటే ఆందోళన చేపడతామంటూ డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళలు హెచ్చరిస్తున్నారు.
ఎస్బిఐ బ్యాంకు ఎదుట మహిళల ఆందోళన..
101
previous post