కర్ణాటకలో అధికారపక్షానికి షాక్ ఇచ్చిన స్పీకర్‌ ఖాదర్‌

Advertisements

<p>అసెంబ్లీలో స్పీకర్ అంటే నిస్పక్షపాతంగా వ్యవహరించారు&period; అధికార&comma; విపక్షాలన్న భేదభావం లేకుండా అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి&comma; అందరి హక్కులను కాపాడాలి&period; కానీ దురదృష్టవశాత్తూ&period;&period; కొన్ని రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులు కనిపించడం లేదు&period; అయితే కర్ణాటక స్పీకర్‌ U&period;T&period;ఖాదర్‌ మాత్రం ఈ విషయంలో అందరికీ ఆదర్శంగా నిలిచారు&period; సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రుల నుంచి&comma; అధికారుల నుంచి సరైన సమాధానాలు రావడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేసి వెళ్లిపోయారు&period;&period;<&sol;p>&NewLine;<p>నిజానికి కొంతకాలంగా ఈ అంశంపై సీరియస్‌గా ఉన్న ఆయన&&num;8230&semi; ఎప్పటికప్పుడు అధికారపక్షాన్ని హెచ్చరిస్తూనే ఉన్నారు&period; సభ్యులు వందల సంఖ్యలో ప్రశ్నలు అడిగితే&period;&period; పదుల సంఖ్యలో కూడా సమాధానాలు రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు&period; ప్రజా సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం అధికారపక్షం బాధ్యత అని గుర్తు చేస్తూనే ఉన్నారు&period; అయినా పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు&period; ఇదే సమయంలో హోం మంత్రి పరమేశ్వర మాత్రం ఏదో ఘనకార్యం చేసినట్లు&&num;8230&semi; 230 ప్రశ్నలకు గానూ&comma; ఎనభై నాలుగింటికి సమాధానం ఇచ్చాం అని ఘనంగా చెప్పుకున్నారు&period; దీనిపై విపక్ష నేత ఆర్‌&period; అశోక్‌ తీవ్ర స్థాయిలో సెటైర్లు వేశారు&period; దీంతో స్పీకర్‌లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది&period; సభ నిర్వహించేది మంత్రుల కోసం కాదు&&num;8230&semi; సభ్యుల కోసమే అని చెప్పారు&period; పదేపదే చెబుతున్నా మంత్రులు&comma; అధికారులేం చేస్తున్నారని నిలదీశారు&period; అధికారులు&comma; మంత్రులు సమావేశమై ఈ సమస్యను పరిష్కరించేంత వరకు సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ఖాదర్‌ పీఠం నుంచి లేచి వెళ్లిపోయారు&period; దీంతో ఖంగుతిన్న ముఖ్యమంత్రి&comma; ఇతర మంత్రులు స్పీకర్‌ ఛాంబర్‌కు వెళ్లి నచ్చ చెప్పారు&period; సీఎస్‌ను పిలిచి&period;&period; నిర్లక్ష్యం వహించిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీరియస్‌గా ఆదేశాలిచ్చారు&&num;8230&semi;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన తర్వాత మారిన బీజేపీ రాజకీయం …

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీగా గంజాయి పట్టివేత..

మేడ్చల్ జిల్లాలో ప్రేమపేరుతో వేధిస్తున్న యువకుడి అరెస్టు..