143
విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో విజయనగరం వెళ్లే రహదారిలో భీమాలి వరకు రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని బొగ్గు లారీలు అధిక లోడలతో రవాణా చేయడమే కాకుండా కాలుష్యం చేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారని…… కనీసం రోడ్లు బాగు చేసే దుస్థితి కూడా లేదని 15 రోజుల్లోగా రోడ్లు బాగు చేయకపోతే సిపిఎం నాయకులు తో పాటు ప్రజలు కూడా తిరుగుబాటు చేసి రహదారులను దిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గాడి అప్పారావు, పీవీ రమణ సిపిఎం గాంధీనగర్ గ్రామ శాఖ కార్యద్దర్సీ, రైతు సంఘం నాయకులు కొంప రామకృష్ణ, తదితరులు పాల్గొన్నార.