మండల పరిధిలోని నాచుకుప్పం గ్రామానికి చెందిన ఉజ్జినప్ప గౌడు (38), భార్య నాగరత్నంమ్మ, ముగ్గురు పిల్లలు వీరిలో గారాబంగా పెంచుకున్న కూతురు ప్రేమ వ్యవహారం వల్ల తండ్రి శవమైనాడు. వివరాల్లోకి వెళితే తావడకుప్పం గ్రామనికి చెందిన గణేష్ (18)కూలీ పనులు చేసుకొంటూ నాచుకుప్పం గ్రామానికి చెందిన ఉజ్జినప్ప గౌడు కూతురు వీణ ను ప్రేమించాడు. ఒక సంవత్సరం గా ప్రేమ వ్యవహారం సాగింది. పెళ్లి చేసుకోవాలని అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులను అడిగాడు. ఈ ప్రేమను తండ్రి అంగీకరించలేదు. కానీ తల్లి ,కూతురు కు ఇష్టం. తండ్రి అడ్డం ఉన్నాడని కట్టుకున్న భార్య,కూతురు, ప్రేమికుడు గణేష్ పథకం రచించి చంపి అతన్ని లక్కనపల్లి ఇసుక దిబ్బల్లో పూడ్చారని. ఈ వివరాలు గణేష్ ద్వారా పోలీసులు సమాచారం రాబట్టారని వీరి వెనుక ఇంకా ఎవరన్న ఉన్నారా అన్న కోణంలో వివరాలు రాబట్టడానికి పోలీసులు ఆరా తీస్తున్నారని సమాచారం, ఈ కథనoపై వివరణ స్థానిక ఎస్ ఐ మోహన్ కుమార్ కోరగా 27 వతేది సాయంకాలం మిస్ అయినట్టు 30 వతేది ఉజ్జినప్ప గౌడు అన్న సొమప్ప గౌడు రక్షణ శాఖ లో పిర్యాదు చేయడం జరిగింది. ఇందులో నిజ నిజాలు తెలియబరుస్తామని ఎస్ ఐ మోహన్ కుమార్ ఒక తెలిపారు.
కూతురి ప్రేమ.. తండ్రి చావు..
114
previous post