కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు

Arvind kejriwal

Advertisements

&NewLine;<p>మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ కోణంపై దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేసింది&period; ఈ కేసులో విచారణకు హాజరుకావాలని పేర్కొంది&period; నవంబర్ 2à°¨ ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి రావాలని తెలిపింది&period; ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం&comma; ఆప్ నేత మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ సుప్రీంకోర్టులో సోమవారం తిరస్కరణకు గురైన గంటల వ్యవధిలోనే ఈ సమన్లు జారీ అవ్వడం గమనార్హం&period; గతేడాది ఏప్రిల్‌లో ఇదే విషయంపై సీబీఐ కూడా కేజ్రీవాల్‌కి నోటీసులు ఇచ్చింది&period; అయితే గతేడాదే దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో కేజ్రీవాల్‌ను నిందితుడిగా పేర్కొనలేదు&period; కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేయడంపై ఆప్ సీనియర్ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ స్పందించారు&period; ఏది ఏమైనా ఆప్ పార్టీని నాశనం చేయాలనేది కేంద్ర ప్రభుత్వ ఏకైక లక్ష్యమని విమర్శించారు&period; ఇందుకోసం ఫేక్ కేసు సృష్టించడం సహా సాధ్యమైనవన్నీ చేస్తున్నారని ఆరోపించారు&period; అరవింద్ కేజ్రీవాల్‌ను జైలుకు పంపి ఆమ్ ఆద్మీ పార్టీని నాశనం చేయాలనే ఆలోచనలో కేంద్రం ఉందని దుయ్యబట్టారు&period; కాగా కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయాలని ఢిల్లీ బీజేపీ నేతలు డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ముగిసిన నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం.

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం.

కాచిగూడ రైల్వే స్టేషన్‌కు 110 ఏళ్ల చరిత్ర.