101
అక్రమ గంజాయి క్రయ, విక్రయాలు రవాణాపై వరుసగా కొరడా ఝలిపిస్తున్న సెబ్ అధికారులు. అక్రమ గంజాయి రవాణా చేసే ఐదుగురు ముద్దాయిలను అరెస్ట్ చేశారు. 95 వేల రూపాయల నగదు,40 కేజీల గంజాయి,5 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ కాబడిన ముద్దాయిలను మీడియా ముందు ప్రవేశపెట్టారని సెబ్ ఏయస్పీ హిమవతి వివరాలను వెల్లడించారు. మాదకద్రవ్యాల రహిత నెల్లూరు జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ప్రజలు మాదకద్రవ్యాల పట్ల జాగ్రత్త వహించాలని సెబ్ ఏయస్పీ హిమవతి సూచించారు.