గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన – ఇంద్రసేనా రెడ్డి

Nallu Indrasenareddy

Advertisements

&NewLine;<p>త్రిపుర గవర్నర్ గా నల్లు ఇంద్రసేనా రెడ్డి ఈ ఉదయం బాధ్యతలు స్వీకరించారు&period; అగర్తలాలో త్రిపుర హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేశ్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయించారు&period; ఈ కార్యక్రమంలో ముఖ్య మంత్రి డాక్టర్ మాణిక్ సాహా&comma; మంత్రులు&comma; అధికారులు పాల్గొన్నారు&period; అనంతరం నూతన గవర్నర్ కు సాయుధ దళాలు గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహించాయి&period; అనంతరం ప్రముఖులను ముఖ్యమంత్రి కొత్త గవర్నర్ కు పరిచయం చేశారు&period; ఈ కార్యక్రమం లో ప్రధాని కార్యాలయ అధికారులు&comma; ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ అధికారులు పాల్గొన్నారు&period; గవర్నర్ దంపతులు బుధవారం నాడు అగర్తలా చేరుకున్నారు &period; ఆ సమయం లో గవర్నర్ దంపతులను ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహ &comma; అతని మంత్రివర్గ సహచరులు &comma; ఎమ్మెల్యేలు &comma; ఎంపీ లు&comma; సీనియర్ ఐఏఎస్ &comma; ఐపీఎస్ అధికారులు అగర్తలా విమానాశ్రమయం లో ఘన స్వాగతం పలికారు&period; అక్కడ కొత్త గవర్నర్ కు &&num;8220&semi;గార్డు -ఆఫ్ -హానర్&&num;8221&semi; నిర్వహించారు&period; ఈ సందర్భం గా తన నియామకం పై రాష్ట్రపతికి &comma; ప్రధాని కి&comma; కేంద్ర హోమ్ మంత్రి కి నల్లు ఇంద్రసేనా రెడ్డి గారు ధన్యవాదాలు తెలిపారు&period; అధికారులు పారదర్శకత &comma; జవాబుదారీతనం పాటించాలని &comma; సాధారణ పౌరులు సైతం సాధికారత సాధించేలా అంతా కృషి చేయాలని పలుపునిచ్చారు&period; ఈ సందర్భం గా అనేకమంది ప్రజా ప్రతినిధులు&comma; నాయకులు గవర్నర్ కు అభినందనలు తెలిపారు&period; తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన అభిమానులు పూల దండలతో నల్లు ఇంద్రసేనా రెడ్డి గారిని సత్కరించారు &period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 38కి పెంచుతూ రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆర్డినెన్స్‌ జారీ చేశారు.

ప్రధాని మోడీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం ద‌క్కింది.

మరోసారి CNG ధర పెంచిన కేంద్రం..