చెరువుల అభివృద్ధికోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృతనరోవర్ పథకంలో భాగంగా పార్వతీపురం పట్టణం కొత్తవలన దుర్గమ్మ కోనేరు అభివృద్ధి పనులు చేపడుతున్నారని ఈ పనుల్లో నాణ్యతలోపం కన్పిస్తుందని టిడిపి పార్వతీపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోనెల విజయచంద్ర ఆరోపించారు. గురువారం కొత్తవలన దుర్గమ్మ కోనేరు అభివృద్ధి పనులను ఆయనతోపాటు టిడిపి నాయకులు, కౌన్సిల్ సభ్యులు, కార్యకర్తలు పరిశీలించారు. ఈ సందర్భంగా విజయచంద్ర మాట్లాడుతూ కోనేరు గట్టుపై నిర్మాణం చేపడుతున్న రోడ్డు కేవలం బూడిదతో కూడిన నాశిరకమైన గ్రావెల్ మాత్రమే అని, సైడు వేసిన సిమెంట్ దిమ్మలు కూడా నాణ్యతలోపమే నాణ్యమైన మెటీరియల్ కాదన్నారు. ఈ కోనేరు అభివృద్ధికోసం రూ.94లక్షల నిధులు మంజూరయ్యాయని ఈ నిధులను దుర్వినియోగం చేయడానికి మాత్రం తూతూ మంత్రంగా అభివృద్ధి పనులు చేపడుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులపై తక్షణమే విచారణ జరిపించాలని ఉన్నతాధికారులను కోరతామన్నారు. మున్సిపల్ కమిషనర్‌ను కూడా సంప్రదిం చడం జరుగుతుందన్నారు.
చెరువు అభివృద్ధి పనుల్లో నాణ్యతా లోపం..
134
previous post