రాష్ట్రంలో ఉన్న టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందజేయాలని లేకపోతే సిపిఎం పార్టీ నే టిడ్కో గృహాలను స్వాధీనం చేసుకుని లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏలూరు శివారు పాణంగి వద్ద నిర్మించిన టిడ్కో గృహాలను పార్టీ నేతలతో కలిసి శ్రీనివాసరావు పరిశీలించారు. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన టిడ్కో గృహాలు శిధిలావస్థకు చేరాయని, జాతీయ సంపదతో నిర్మించిన గృహాలను రాజకీయ కక్షలతో వైసిపి ప్రభుత్వం నిరుపయోగంగా వదిలేసిందని ఆయన మండిపడ్డారు. ఒక్క రూపాయికే గృహాలను అందజేస్తామని సీఎం హామీ ఇచ్చి ఆ హామీని తుంగలోతొక్కారని మండి పడ్డారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంబాబు ఏలూరు టిడ్కో గృహాల వద్ద నుంచి అందిస్తారు.
టిడ్కో గృహాలు పరిశీలించిన శ్రీనివాసరావు..
131
previous post