128
తిరుపతి డాలర్స్ గ్రూప్ కార్యాలయంలో రాత్రి 12:00 వరకు ఐటి అధికారులు సోదాలు చేశారు. రెండు రోజులపాటు 30 మంది ఐటి అధికారులు డాలర్స్ గ్రూప్ చైర్మన్ దివాకర్ రెడ్డి, ఆయన బంధువుల ఇల్లు, కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. ఐటీ అధికారుల తనిఖీలు ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన దివాకర్ రెడ్డి ఐటి దాడుల వెనుక రాజకీయ కోణం ఉందా అన్న విషయం మీద ఇప్పుడే మాట్లాడలేనని తిరుపతిలో అత్యధిక టాక్స్ కట్టేవారిలో తాను ఒకడని అన్నారు. ఎందుకు తనమీద ఐటి తనిఖీలు నిర్వహించారు అన్న విషయం తనకు అర్థం కావడం లేదన్నారు. మొత్తం మీద అసలు వాస్తవాలు భవిష్యత్తులో బయటపడతాయని ఆయన తెలిపారు.