Thursday, June 18, 2026
News Navigation
Thursday, June 18, 2026
News Navigation

Breaking

Thursday, June 18, 2026
Home International ప్రపంచంలోని అత్యంత కాలుష్యకారక నగరాల్లో మూడు మననే..

ప్రపంచంలోని అత్యంత కాలుష్యకారక నగరాల్లో మూడు మననే..

by Satya
pollutant

ప్రపంచంలోని అత్యంత కాలుష్యకారక నగరాల్లో మూడు మన దేశంలోనే ఉన్నాయి. కాలుష్యం కారణంగా గాలిలో నాణ్యత పడిపోయి నిత్యం అల్లాడిపోయే దేశ రాజధాని ఢిల్లీతోపాటు కోల్‌కతా, ముంబై కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఈ మేరకు స్విస్ గ్రూప్ ‘ఐక్యూ ఎయిర్’ నివేదిక వెల్లడించింది. అంతేకాదు, ఈ జాబితాలో ఢిల్లీ అగ్రస్థానంలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. నగరంలో రియల్ టైం గాలి నాణ్యత ఈ ఉదయం 7.30 గంటలకు ఏక్యూఐ 483గా ఉంది. రెండో స్థానంలో పాకిస్థాన్‌లోని లాహోర్ ఉండగా, కోల్‌కతా మూడో స్థానంలో, ముంబై ఆరో స్థానంలోను ఉన్నాయి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా, పాకిస్థాన్‌లోని కరాచీ నాలుగైదు స్థానాల్లో ఉన్నాయి. చైనాలోని షెన్యాంగ్ , హాంగ్జౌ , కువైట్‌లోని కువైట్ సిటీ, చైనాలోని వుహాన్ వరుసగా 7, 8, 9, 10 స్థానాల్లో నిలిచాయి.

Advertisements

You may also like

Our Visitor

025338
Total views : 146990

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.