296
దుర్గ గుడిలో విగ్రహం మాయమవడముపై గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామంలో గత 30 సంవత్సరాలుగా గ్రామంలో పూజలు అందుకుంటున్న దుర్గమ్మ విగ్రహం ఈరోజు ఉదయం కనిపించకపోవడముతో గ్రామ ప్రజలు స్వామి భక్తులు ఆవేదన చెందారు. రోజులాగే ఉదయం దుర్గమ్మ దర్శనం కోసం వస్తే విగ్రహం లేకపోవడంతో అవాక్కయ్యామన్నారు. ఈమధ్య కాలంలో గుడి ఉన్న స్థలం కోసం గ్రామంలో ప్రజలకు స్థలం మాదంటూ వారికి వాధిద్వాదం చోటుచేసుకుందని తెలిపారు. విగ్రహం అపహరణ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఈ ఘటనకు పాల్పడిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఈసందర్భంగా పలువురు కోరారు.