127
అదృశ్యమైన నలుగురు బాలికలు సురక్షితం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉండగా జి ఆర్ పి పోలీసులు వారిని గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. బాలికలు అదృశ్యం అయిన వెంటనే స్పందించిన తణుకు పట్టణ పోలీసులు వారి వద్ద ఉన్న సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా దర్యాప్తు మమ్మరం చేశారు. ఈ క్రమంలో సికింద్రాబాద్ వద్ద వీరిని సురక్షితంగా అదుపులోకి తీసుకున్నారు.