118
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం సీతారాంపురం గ్రామ సమీపంలో పిడుగుపాటుకు 40 గొర్రెలు మృతి చెందాయి. అశ్వాపురం మండలం భీమవరం గ్రామానికి చెందిన బొల్లు ఉప్పలయ్యకు సంబంధిత 40 గొర్రెలను భీమవరం నుండి గొర్రెల గ్రాసం (మేత) కోసం సీతారామపురం గ్రామ సమీపానికి తీసుకొని ఆ ప్రాంతంలో మేపుతున్నాడు. మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో రాత్రి వేళ అక్కడే ఉండే పరిస్థితి ఏర్పడింది. ఆ ప్రాంతంలో రాత్రివేళ పిడుగు పడి గొర్రెలు మృతి చెందాయని ఉప్పలయ్య ఆవేదన చెందారు. మృతి చెందిన గొర్రెలకు నష్టపరిహారం చెల్లించాలని బొల్లు ఉప్పలయ్య ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు.
Read Also..