136
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం త్యాగరాజు భవనంలో మాత వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారి 56వ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ధనలక్ష్మి దేవి అలంకరణ రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో కోటి 98 లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్రంలోని పలువు నాయకులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ మాత వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలన్నారు.