ప్రధాని ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు హాజరైన సీఎం రేవంత్

Advertisements

<p>ముంబైలో జరిగిన &OpenCurlyQuote;క్లైమేట్ వీక్’ సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి నేరుగా హస్తినకు చేరుకున్నారు&period; దేశ రాజధానిలోని భారత్ మండపంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న &OpenCurlyQuote;ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ &&num;8211&semi; 2026’ లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు ఆయన హాజరయ్యారు&period; ఈ సదస్సుకు ఓపెన్ ఏఐ సీఈఓ శ్యామ్ ఆల్ట్‌మాన్&comma; గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వంటి గ్లోబల్ టెక్ లీడర్లతో పాటు సుమారు 40 మందికి పైగా అంతర్జాతీయ కంపెనీల సీఈఓలు హాజరయ్యారు&period; వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు&comma; ఐటీ మంత్రులు&comma; 45కు పైగా దేశాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు&period; &OpenCurlyQuote;సర్వజన హితాయ&comma; సర్వజన సుఖాయ’ అనే థీమ్ తో జరుగుతున్న ఈ సదస్సులో ఆరోగ్యం&comma; వ్యవసాయం&comma; విద్య వంటి రంగాల్లో కృత్రిమ మేధ వినియోగంపై చర్చలు జరిగాయి&period; కాగా&comma; హైదరాబాద్‌ ను గ్లోబల్ ఏఐ హబ్‌గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డికి ఈ పర్యటన అత్యంత కీలకం&period; సదస్సులో పాల్గొనే అంతర్జాతీయ టెక్ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యి&comma; తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఆయన వివరించే అవకాశం ఉంది&period; అలాగే&comma; రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని మోదీతో కూడా ఆయన చర్చించినట్లు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్లో నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

తెలంగాణలో ఎండలు రోజు రోజుకీ భయంకరంగా మారుతున్నాయి.

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ మెగా డేటా సెంటర్..