స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఆనందం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు బెయిల్ రావడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానాన్ని తాము ముందు నుంచి తప్పుపడుతున్నామని… నోటీసులు ఇవ్వకుండా, విచారణ జరపకుండానే ఆయనను అరెస్ట్ చేశారని విమర్శించారు. ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండానే ఎలా అరెస్ట్ చేస్తారని విమర్శించారు. బాబుకు బెయిల్ రావడం మంచి పరిణామమని చెప్పారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వంపై పురందేశ్వరి విమర్శలు గుప్పించారు. నాణ్యత లేని మద్యాన్ని అమ్ముతూ, ప్రజల ఆరోగ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నాశనం చేస్తోందని మండిపడ్డారు. మద్యం అమ్మకాల ద్వారా జేబులు నింపుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని దుయ్యబట్టారు.
బాబు బెయిల్ పై ఆనందం వ్యక్తం చేసిన పురందేశ్వరి..
111
previous post