దేవాదాయ శాఖ ఉద్యోగులకు ఎన్నికల విధులు అప్పగిస్తుండడంపై ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి(Purandeshwari) కేంద్ర ఎన్నికల సంఘం, ఏపీ సీఈవో(AP CEO)కు లేఖ రాశారు. దేవాదాయ శాఖ సిబ్బంది ఎప్పుడూ ఎన్నికల విధుల్లో పాల్గొనలేదని పురందేశ్వరి స్పష్టం చేశారు. ఆలయాలకు సంబంధించిన విధులు నిర్వర్తించాల్సిన దేవాదాయ సిబ్బంది ఎన్నికల విధులకు వెళితే భక్తులు ఇబ్బంది పడతారని తెలిపారు.
ఇది చదవండి:Pawan Kalyan : తిరుపతి నియోజకవర్గం నుంచి వైసీపీ ని తరిమి కొట్టాలి..
ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో అనేక పండుగలు, ఉత్సవాలు ఉన్నాయని పురందేశ్వరి వెల్లడించారు. వేసవి సెలవుల్లో ఆలయాలకు వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని, ఈ నేపథ్యంలో దేవాదాయ సిబ్బందికి ఎన్నికల విధులపై పునఃపరిశీలన చేయాలని విజ్ఞప్తి చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.






Total views : 147211