Wednesday, September 30, 2026
News Navigation
Wednesday, September 30, 2026
News Navigation

Breaking

Wednesday, September 30, 2026
Home Andhra Pradesh మానవత్వం చాటుకున్న హోంమంత్రి అనిత.

మానవత్వం చాటుకున్న హోంమంత్రి అనిత.

by CVR NEWS
మానవత్వం చాటుకున్న హోంమంత్రి అనిత

హోం మంత్రి అనిత మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాద బాధితులను చూసి చలించిపోయిన హోం మంత్రి.. వారికి సమర్యలు చేయడంతో పాటు వెంటనే ఆస్పత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. రెండేళ్ల ఎన్డీఏ పాలన విజయోత్సవ సభలో పాల్గొనేందుకు అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని తన నివాసం నుంచి హోం మంత్రి అనిత బయలుదేరారు. మార్గమధ్యంలో ఎలమంచిలి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని చూసి వెంటనే తన కాన్వాయ్‌ను ఆపించారు. రోడ్డుపై గాయాలతో బాధపడుతున్న వారిని చూసిన హోంమంత్రి అనిత చలించిపోయారు. వెంటనే అక్కడకు చేరుకుని గాయాలైన వారికి సపర్యలు చేశారు. అంబులెన్స్‌ను ఏర్పాటు చేసి సమీపంలోని ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. గాయపడిన వారికి ఆర్థిక సహాయం అందజేశారు. వైద్యులతో మాట్లాడి, మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆదేశించారు. రోడ్డు ప్రమాద బాధితుల పట్ల హోంమంత్రి అనిత చూపిన చొరవ, మానవత్వంపై స్థానికులు ప్రశంసించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: