Wednesday, September 30, 2026
News Navigation
Wednesday, September 30, 2026
News Navigation

Breaking

Wednesday, September 30, 2026
Home Crime అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో ఏటీఎం చోరీ.

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో ఏటీఎం చోరీ.

by CVR NEWS
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో ఏటీఎం చోరీ

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో ఏటీఎం దొంగల ముఠా మరోసారి రెచ్చిపోయింది. ఎస్‌బీఐ ఏటీఎం మిషన్‌ను పెకలించి ఎత్తుకెళ్లారు. అనంతరం నగదును దోచుకుని మిషన్ పరికరాలను సింగనమల మండలం ఆకులేడు గ్రామ సమీపంలోని పొలాల్లో పడేసి పరారయ్యారు. కేసునమోదు చేసుకున్న పోలీసులు పలు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. దుండగులు బొలెరో వాహనంలో వచ్చి తాడు సహాయంతో ఎస్‌బీఐ ఏటీఎం మిషన్‌ను లాగి బయటకు తీసుకెళ్లారు. ఈ ఘటన మొత్తం ఏటీఎం వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. దుండగులు అత్యంత ప్రణాళికాబద్ధంగా ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఏటీఎం మిషన్ కనిపించకపోవడంతో అప్రమత్తమైన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సింగనమల మండలం ఆకులేడు గ్రామ పరిధిలోని పొలాల్లో ఏటీఎం మిషన్ పరికరాలు గుర్తించారు. నగదును తీసుకుని మిషన్‌ను అక్కడ పడేసి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఏటీఎంలో ఎంత మొత్తం నగదు ఉందనే విషయాన్ని బ్యాంకు అధికారులు నిర్ధారించాల్సి ఉంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: