Wednesday, September 30, 2026
News Navigation
Wednesday, September 30, 2026
News Navigation

Breaking

Wednesday, September 30, 2026
Home Crime విజయవాడలో కంటైనర్‍ను ఢీకొన్న గంజాయి తరలిస్తున్న కారు.

విజయవాడలో కంటైనర్‍ను ఢీకొన్న గంజాయి తరలిస్తున్న కారు.

by CVR NEWS
విజయవాడలో కంటైనర్‍ను ఢీకొన్న గంజాయి తరలిస్తున్న కారు

విజయవాడ బైపాస్ రోడ్డులో గంజాయి తరలిస్తున్న కారు కంటైనర్‌ను ఢీకొట్టడం వల్ల ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ పరిధిలోని నున్న పోలీస్ స్టేషన్ పరిమితుల్లో గల బైపాస్ రోడ్డుపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
తమిళనాడుకు చెందిన నలుగురు యువకులు ఒడిశా-ఆంధ్రా సరిహద్దులో 25 కిలోల గంజాయిని కొనుగోలు చేసి కారులో తరలిస్తున్నారు.కారు నడుపుతున్న వ్యక్తి గంజాయి మత్తులో ఉండటంతో, నున్న సమీపంలో కారు నియంత్రణ కోల్పోయి ముందు వెళ్తున్న కంటైనర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. కారులో ఉన్న నలుగురు యువకులకు తీవ్ర గాయాలవగా, స్థానికుల సహాయంతో వారిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. చికిత్స పొందుతున్న సమయంలో వారు గంజాయి మత్తులో ఉండటాన్ని పోలీసులు గమనించారు. ప్రమాద స్థలంలోని కారును తనిఖీ చేయగా 25 కిలోల గంజాయి ప్యాకెట్లు లభ్యమవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిందితుల్లో ఒకరు పోలీసుల కళ్లు గప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై నున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, పరారైన నిందితుడి కోసం గాలిస్తూ తదుపరి దర్యాప్తును ముమ్మరం చేశారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: